వైద్యశాస్త్రంలో 2021 కి సంబంధించి నోబెల్ ప్రైజ్ ను ప్రకటించారు. ఉష్ణోగ్రత, స్పర్శ గ్రాహకాలపై పరిశోధనలు జరిపినందుకు గానూ అమెరికన్ శాస్త్రవేత్తలు డెవిడ్ జూలియస్, ఆర్డమ్ పాటపౌటియన్ లకు నోబెల్ వరించింది. మానవుడు మనుగడ కోసం వేడి, చలి, స్పర్శలను గ్రహించే సామర్థ్యం అవసరం, ఇది మనచుట్టూ ఉన్న వాతావరణంతో మన సంబంధాన్ని బలపరుస్తుంది. సహజంగా ఈ అనుభూతులను మనం తేలికగా తీసుకుంటాం. అయితే ఉష్ణోగ్రత పీడనాన్ని గ్రహించేందుకు నరాలు ఏవిధంగా ప్రేరేపించబడుతున్నాయనే ప్రశ్నలకు సమాధానాలు దొరికాయని నోబెల్ అసెంబ్లీ అభిప్రాయపడింది. ప్రతిష్టాత్మక ఈ బహుమతి కింద బంగారు పథకంలో పాటు 1.14 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని విజేతలకు ఇస్తారు. ఆల్ ప్రెడ్ నోబెల్ పేరుతో 1895 నుంచి నోబెల్ పురస్కారాలు అందిస్తున్నారు. వైద్యశాస్త్రంతో పాటు ఫిజిక్స్, రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, శాంతి, సాహిత్యం విభాగాల్లో నోబెల్ ప్రైజ్లను అందిస్తున్నారు.
ఉష్ణోగ్రత, స్పర్శ గ్రాహకాలపై పరిశోధనకు వైద్యంలో నోబెల్
-