ఆ ఫోన్స్ లో రికార్డింగ్ మొదలుపెట్టిన గూగుల్…!

-

నోకియా ఫోన్‌లలో మరో ఫీచర్ ని తీసుకొచ్చింది గూగుల్. ఆండ్రాయిడ్ వన్ సాఫ్ట్‌వేర్‌లో భాగమైన గూగుల్ యాప్ ఉన్న సంగతి తెలిసిందే. ఇది కాంటాక్ట్ ట్యాబ్ మరియు నంబర్ ప్యాడ్‌ను అందించడంతో పాటు, మిస్ అయిన, రిసీవ్ కాల్స్ మరియు డయల్ చేసిన అన్ని రకాల కాల్‌ల లాగ్‌స్ ను దీనిలో ఉంచుతున్నారు. నోకియా ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లు ఇప్పుడు గూగుల్ ఫోన్ కాల్ యాప్‌లో కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చాయి.

ఈ ఫీచర్ ఇప్పటికే కొన్ని నోకియా స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులో ఉంది. నోకియా కమ్యూనిటీ ఫోరమ్‌లోని అనేక మంది వినియోగదారులు ఈ ఫీచర్ తమకు అందినట్టు పేర్కొన్నారు. కొంత మంది స్క్రీన్ షాట్ లను కూడా పోస్ట్ చేసారు. గూగుల్ ఫోన్ యాప్ 47 కాల్ స్క్రీన్‌లో కాల్ రికార్డింగ్ సింబల్ ని చూపిస్తుంది. కాల్ సమయంలో జరిగిన సంభాషణలను రికార్డ్ చేయడానికి ఇది ఆలో చేస్తుంది.

రికార్డ్ అయ్యే ఫైళ్ళకు సిస్టమ్ అనే పేరు ఉంటుంది. ఆ తర్వాత మీరు మార్చుకోవచ్చు అని పేర్కొంది. మిగిలిన ఫోన్స్ లో కూడా ఇది అందుబాటులోకి వస్తుంది. దీనికి భద్రతా ప్రమాణాలను కూడా జోడిచించారు. ఏ ఇబ్బంది ఉండకూడదాని భావిస్తున్న గూగుల్ ఎప్పటికప్పుడు సరికొత్తగా దీన్ని అభివృద్ధి చేస్తూ వస్తుంది. జనవరి లోనే కొన్ని ఫోన్స్ కి ఇది యాడ్ అయినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news