ఇండియాలో లాంచ్‌ అయిన నోకియా సీ31.. ధర పదివేల లోపే..!

-

నోకియా సీ31 స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో సెప్టెంబర్‌లోనే లాంచ్ అయింది. మొత్తం రెండు వేరియంట్లలో ఫోన్ లాంచ్‌ అయింది. దీని ధర కూడా పదివేలు మాత్రమే.. ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

నోకియా సీ31 ధర, ఆఫర్లు..

ఇందులో రెండు వేరియంట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999గా ఉంది.
ఇక 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.10,999గా నిర్ణయించారు.
చార్ కోల్, మింట్ షేడ్స్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

నోకియా సీ31 స్పెసిఫికేషన్లు..

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.
ఇందులో 6.74 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు.
దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. వాటర్ డ్రాప్ తరహా నాచ్ కూడా ఇందులో ఉంది.
ఆక్టాకోర్ యూనిసోక్ ప్రాసెసర్‌ను నోకియా సీ31లో అందించారు. 4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.
వైఫై, జీపీఎస్, ఏజీపీఎస్, గెలీలియో, బ్లూటూత్ వీ4.2, 3.5 ఎంఎం ఆడియో జాక్, మైక్రో యూఎస్‌బీ పోర్టు అందించారు.
ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందుబాటులో ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5050 ఎంఏహెచ్ కాగా, 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
దీని మందం 0.86 సెంటీమీటర్లు కాగా, బరువు 200 గ్రాములుగా ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే…

ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version