నార్త్ సెంట్ర‌ల్ రైల్వేలో…. ఇలా అప్లై చెయ్యండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. నార్త్ సెంట్రల్ రైల్వేస్ స్పోర్ట్స్ కోటాలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ప‌లు క్రీడ‌ల్లో రాణించిన అభ్య‌ర్థులు ఈ పోస్టులు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అవకాశాన్ని రైల్వేస్ ఇస్తోంది.

Indian-Railways
Indian-Railways

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి వుంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 12, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది కనుక ఈ లోగా అప్లై చేసుకోవడం మంచిది. అభ్య‌ర్థుల‌ను ఎగ్జామినేష‌న్ లేదా స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయనున్నారు.

వయస్సు వచ్చేసి 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. నోటిఫికేష‌న్, ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.rrcpryj.org/Notification.php నుసంద‌ర్శించాల్సి ఉంటుంది.

ఇక విద్యార్హతల వివరాల లోకి వెళితే.. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థులు ఇంట‌ర్మీడియ‌ట్‌, ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత క్రీడ‌ల్లో ఒల‌పింక్స్‌, వ‌ర‌ల్డ్ గేమ్‌, ఏసియ‌న్ గేమ్స్‌, చాంపియ‌న్ ట్రోఫీ, త‌త్స‌మ స్థాయిలో ప్రాతినిథ్యం వ‌హించాలి. ఇక ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూస్తే..

ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.rrcpryj.org/Notification.php ను సంద‌ర్శించాలి.
నెక్స్ట్ అప్లికేష‌న్ ఫాంలోకి వెళ్లాలి.
ఆ తరవాత ఫామ్ ని నింపాలి.ద‌ర‌ఖాస్తు పూర్త‌యిన త‌రువాత ప‌రీక్ష ఫీజు చెల్లించాలి.
జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు రూ. 500 ప‌రీక్ష ఫీజు, ఎస్సీ,ఎస్టీ,ఎక్స్‌స‌ర్వీస్ మ్యాన్‌, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు రూ.250 ప‌రీక్ష ఫీజు ఉంటుంది.
ఫైనల్ గా అభ్య‌ర్థి అప్లికేష‌న్‌ను స‌బ్‌మిట్ చేయాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news