ఓమిక్రాన్ పై రాజ్య సభలో కేంద్రం కీలక ప్రకటన

-

ప్రపంచాన్ని కలవర పెడుతున్న కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ పై ఇండియా కూడా అలెర్ట్ అయింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎయిర్ పోర్టుల వద్ద తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని ఆదేశించింది. కరోనా రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చే వారికి టెస్టులు నిర్వహించి .. ఒక వేళ పాజిటివ్ వస్తే శాంపిళ్లను జినోమ్ సిక్వెన్సింగ్ కోసం పంపించాలని ఆదేశించిది.

ఇదిలా ఉంటే ఓమిక్రాన్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు అడిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. భారత దేశంలో ఒక్క ఓమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదని రాజ్యసభలో తెలిపారు. జినోమ్ సీక్వెన్సింగ్ టెస్టుల కోసం ల్యాబులను సిద్ధం చేసినట్లు సభలో తెలిపారు. దేశంలో ప్రస్తుతం కరోనా అదుపులోనే ఉందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news