ఏది ఏమైనా కిమ్ రూటే సపరేట్

-

అందరిది ఓ దారైతే.. నా దారి మాత్రం సపరేట్ అంటాడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ప్రపంచ దేశాలన్నీ కరోనా భయంతో వణికిపోతుంటే.. నార్త్ కొరియా క్షిపణి ప్రయోగాలు చేపట్టడంలో బిజీగా గడుపుతోంది. తాజాగా నార్త్ కొరియా లార్జ్ మల్టిపుల్ రాకెట్ లాంచర్లను విజయవంతంగా ప్రయోగించిందని ఆ దేశ అధికారిక వార్త సంస్థ కేసీఎన్ఏ తెలిపింది. ఆదివారం నార్త్ కొరియా తూర్పు తీరంలో స్పల్ప దూరం ప్రయాణించే రెండు బాలిస్టిక్ క్షిపణులను పేల్చివేసినట్టు పేర్కొంది.

మల్టిపుల్‌ రాకెట్‌ లాంచర్ల సాంకేతికతపై గత ఏడాది ఆగస్టు నుంచి ప్రయోగాలు చేస్తున్నట్టు పేర్కొంది. అధ్యక్షుడు కిమ్ ఎదుట అనేక సార్లు ఈ ప్రయోగాలు చేశామని తెలిపింది. అయితే ఈ తాజా క్షిపణి ప్రయోగానికి కిమ్ హాజరయ్యాడా లేదా అన్న విషయాన్ని సదరు వార్తసంస్థ ప్రస్తావించలేదు. కాగా, అధికారిక పార్టీ వైస్‌ ఛైర్మన్‌ దిప్యోంగ్‌ చోల్‌ నేతృత్వంలో, అకాడమీ ఆఫ్‌ నేషనల్‌ డిఫెన్స్‌ వద్ద ఈ మిసైల్స్‌ను పరీక్షించారు.

మరోవైపు నార్త్ కొరియా చర్యలపై దక్షిణ కొరియా మిలటరీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు కరోనా వైరస్ బారిన పడి వేలాది మంది ప్రాణాలు పోతుంటే కిమ్ ఇలాంటి క్షిపణి ప్రయోగాలను ప్రొత్సహించడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news