ఇలాంటివి ప్రీజ్‌లో పెట్టకపోవడమే మంచిది..!?

-

నేటి సమాజంలో ప్రీజ్, టీవీ లేని ఇల్లు అంటూ లేదు. ఎంతపేద కుటుంబం అయినా ఇవి వాడుతూనే ఉన్నారు. ఇక మనం కూరగాయాలు బయట ఉంటే పాడైపోతాయని తప్పనిసరిగా ప్రీజ్‌లో పెట్టాలి అనుకుంటాం. అయితే అన్ని కూరగాయాలకు ఫ్రీజ్‌లో అశ్రయం ఇవ్వాల్సిన అవసరం లేదు. టమాటా ఫ్రిజ్‌లో పెడితే చల్లదనానికి పైపొర పాడవుతుంది. కావున రూం టెంపరేచర్‌లోనే వాటిని ఉంచాలి. ఎక్కువ టమాటాలు కొనేయకుండా అవసరం ఉన్న వరకే వాటిని కొనుగోలు చేయడం మంచింది.

అంతేకాదు కీరదోపను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఫ్రిజ్‌లోని ఉండే కూల్‌కు అవి మెత్తబడిపోతాయి. దీంతో తాజాధనం పోతుంది. ఆలుగడ్డను కూడా వాటిలో ఉంచకపోవడం మంచిది.

చల్లధనం కారణంగా పిండిపదార్ధాలు చక్కెరగా మారుతాయి. దీంతో అలుగడ్డ రుచి తగ్గుతుంది. అందుకే అలుగడ్డలను బయట ఉంచడమే మేలు.

ఇక ఇతర తినే పదార్ధాలు విషయానికి వస్తే ..బ్రెడ్డు ప్యాకెట్ దీన్ని ప్రిజ్‌లో పెటకూడదు. చల్లదనానికి బుజు పట్టే అవకాశం ఉంటుంది. అలాగే బ్రెడ్‌ లోని పిండిపదార్థాలు చక్కెరగా మారి సహజమైన రుచి తగ్గుతుంది. అందువలన బ్రెడ్‌ వాడేయడం మంచిది. ఫ్రిజ్‌లో క్రీమ్‌ ఉండే కేక్‌‌ను కూడా పెట్టకూడదు. బయట వాతవారణంలోనే కేక్‌ రుచి తగ్గకుండా ఉంటుంది.

అయితే మూత ఉన్న కంటెయినర్‌లో కేక్‌ను నిల్వ ఉంచుకోవాలి. పండ్ల విషయానికి వస్తే ఖచ్చగా ఉండే అరటిపండ్లు మగ్గాలంటే పొడి వాతావరణం అవసరం. ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల సరిగా పండకపోగా, పండుపై తోలు నల్లబడిపోతుంది. అలాగే రుచి తగ్గుతుంది. బాదం పప్పులు, వాల్‌నట్స్‌, ఎండుఖర్జూరాలు, జీడిపప్పు లాంటివి ఫ్రిజ్‌లో పెడితే రుచి పోతుంది. కావున వాటిని గాలి చొరబడని డబ్బాలో ఉంచి మూతపెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news