రేపు గద్వాలలో కేటీఆర్ పర్యటన : బహిష్కరించిన టిఆర్ఎస్ నేతలు !

జోగులాంబ గద్వాల జిల్లా: రేపు గద్వాల జిల్లాలో కేటీఆర్ పర్యటించనున్నారు. అలంపూర్ చౌరస్తా లో వంద పడకల ఆసుపత్రి భూమి పూజకు కేటీఆర్ కార్యక్రమానికి హాజరుకానున్నారు కేటీఆర్. ఈ నేపథ్యం లో మంత్రి కేటీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. కేటీఆర్ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ లు, సింగిల్ విండో, మార్కెట్ యార్డ్ మెంబర్లు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

ktr
ktr

అయితే ఆ నేతలందరూ టీఆరెస్ పార్టీ నేతలు కావడం గమనార్హం. ఆసుపత్రి ఏర్పాటు అలంపూర్ లో కాకుండా,… చౌరస్తా లో శంఖుస్థాపన చేయడం పై టిఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వంద పడకల ఆసుపత్రి కొరకు అల్లంపూర్ పట్టణానికి కేటాయిస్తూ 98 జీవో విడుదల చేసింది టిఆర్ఎస్ సర్కార్. ఈ నేపథ్యం లోనే వంద పడకల ఆసుపత్రి భూమి పూజ కొరకు రేపు జరగబోయే కార్యక్రమానికి కేటీఆర్ పాల్గొనే కార్యక్రమానికి బహిష్కరిస్తున్నామని తీర్మానం చేశారు మండల తెరాస ప్రజా ప్రతినిధులు. దీంతో మంత్రి కేటీఆర్ రేపటి పర్యటన పై తీవ్ర ఉత్కంట నెలకొంది.