ఈఎస్ఐసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Join Our Community
follow manalokam on social media

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది. ఈఎస్ఐసీ హైదరాబాద్ బ్రాంచీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్, జూనియర్ రెసిడెంట్, సీనియర్ రెసిడెంట్, ఫ్యాకల్టీ, కన్సల్టెంటీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటన జారీ చేసింది. నిరుద్యోగులు ఆన్‌లైన్ ద్వారా ఆయా పోస్టులను సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకుని ఈఎస్ఐసీ పేర్కొంది. పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు. ఈ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎస్ఐసీలో విధులు నిర్వహించాలి. అప్లికేషన్ పక్రియ ఈ నెల 18వ తేదీన ప్రారంభం కానుందని, దరఖాస్తు చివరి తేదీ మార్చి 25వ తేదీన ముగుస్తుందని ఈఎస్ఐసీ పేర్కొంది.

ESIC
ESIC

ఈఎస్ఐసీ సంస్థలో మొత్తంగా 189 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో సీనియర్ రెసిండెంట్స్ పోస్టులు 96, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 25, జూనియర్ కన్సల్టెంట్ పోస్టులు 17, ప్రొఫెసర్ పోస్టులు 17, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 11, జూనియర్ రెసిడెంట్స్ పోస్టులు 8, కన్సల్టెంట్స్ పోస్టులు 8, సీనియర్ కన్సల్టెంట్ పోస్టులు 7, స్పెషాలిటీ స్పెషలిస్ట్ పోస్టులు 5, సీనియర్ రీసర్చ్ పోస్టులు 5 ఖాళీలు ఉన్నాయి. ఆయా పోస్టుల అర్హత, ఎక్స్‌పిరియన్స్, పరీక్షల ఆధారంగా పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది.

అప్లికేషన్ విధానం..
పైన పేర్కొన్న పోస్టులను అప్లై చేసుకోవాలనే అభ్యర్థులు ముందుగా http://esichydapp.com/user/register అనే వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాలి. వెబ్‌సైట్‌లో లాగిన్ అయి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మీ ఈ-మెయిల్ అడ్రస్, పాస్‌వర్డ్ మీకు గుర్తుండేలా పెట్టుకోవాలి. ఆ తర్వాత మీ వివరాలను నమోదు చేయాలి. ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసి.. ఫైనల్ సబ్‌మిట్ చేయాలి. పోస్టులు అప్లికేషన్ చేసుకోవడానికి ఫీజు రూ.500 కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఐసీ ఉద్యోగులు, మహిళలు, పీహెచ్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కలదు. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న అభ్యర్థుల అర్హత ప్రకారం షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆయా పోస్టులలో అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. పోస్టుల వివరాలను సంబంధించిన పూర్తి వివరాలకు esic.nic.in వెబ్‌సైట్‌కి లాగిన్ అయి తెలుసుకోవచ్చు.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...