కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్

-

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపును హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తుండగా.. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు స్థానం ఓట్ల లెక్కింపు నల్లొండలోని ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో నిర్వహిస్తున్నారు. కాగా, ఈ రోజు ఉదయం 7 గంటలకు తిరిగి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తుది ఫలితాలు తేలేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. కాగా, పెరిగిన పోలింగ్‌తోపాటు జంబో బ్యాలెట్ ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఇప్పటివరకు ఐదు రౌండ్ ఫలితాలు వచ్చాయి. అన్ని రౌండ్లలో కలిపి తెరాస అభ్యర్థి వాణీదేవి ఆధిక్యంలో ఉన్నారు. ఆరో రౌండ్ ఫలితాలను లెక్కిస్తున్నారు. నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి తెరాస సిట్టింగ్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఇందులో అధికారులు ఆరు రౌండ్‌ల ఫలితాలను వెల్లడించారు. ఏండో రౌండ్ లెక్కింపు కొనసాగుతోంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానంలో ఐదో రౌండ్ ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావుపై 6,555 అధిక్యపు ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఐదో రౌండ్‌లో వాణీదేవికి 88,304 ఓట్లు నమోదు అయ్యాయి. ఈ తర్వాత రాంచందర్ రావు (బీజేపీ)కి 81,749, ప్రొ.నాగేశ్వర్‌కు 42,604 ఓట్లు నమోదయ్యాయి.

నల్గొండ-వరంగల్-ఖమ్మం ఆరో రౌండ్ ఫలితాల్లో తెరాస సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ప్రత్యర్థి తీర్మార్ మల్లన్నపై 22,843 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఆరు రౌండ్లను కలిపి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 95,317 ఓట్లు పోలయ్యాయి. తీన్మార్ మల్లన్నకు 72,474 ఓట్లు, ప్రొ.కోదండరాంకు 59,705 ఓట్లు, ప్రేమందర్ రెడ్డికి 34,228 ఓట్లు, రాములు నాయక్‌కు 24,268 ఓట్లు పోలయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news