బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 60 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. ఈనెల 9వరకే గడువు.. 

-

బ్యాంకు జాబ్‌లు కోసం ఎదురుచుస్తున్నారు.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే.. బ్యాంక్ ఆఫ్‌ బరోడాలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల అయింది. ఐటీ ప్రొఫెషనల్స్ విభాగంలో వివిధ ఖాళీల భర్తీకి ఈ నియామకాలను చేపట్టింది. మొత్తం 60 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అయితే.. కాంట్రాక్ట్ విధానంలో ఈ నియామకాలను చేపట్టినట్లు బ్యాంక్ వెల్లడించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది..దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 9ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, అప్లై చేసుకునే విధానం..

విద్యార్హతల వివరాలు:

కంప్యూటర్ సైన్స్ లేదా ఐన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ/బీటెక్ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు..ఇతర పూర్తి వివరాలను అభ్యర్థులు నోటిఫికేషన్లో చూడొచ్చు.

దరఖాస్తు ఫీజు:

అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో రూ.600 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, PWD, మహిళా అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. అభ్యర్థులను మొదట షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.

ఎలా అప్లై చేయాలంటే:

అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://www.bankofbaroda.in/ ను ఓపెన్ చేయాలి.
అనంతరం కెరీర్ (https://www.bankofbaroda.in/career) ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
తర్వాత “Current Opportunities” పై క్లిక్ చేయాలి.
అనంతరం నోటిఫికేషన్ విభాగంలో Apply Now ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
సూచించిన వివరాలను నమోదు చేసి దరఖాస్తు పూర్తి చేయాలి.
భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ప్రింట్‌ను భద్రపరుచుకోవాలి.
నోటిఫికేషన్‌ గురించి పూర్తిగా తెలియాలంటే..బ్యాంక్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంటుంది. ఇంట్రస్ట్‌ ఉంటే.. క్షుణ్ణంగా చదివి అప్లై చేసుకోవచ్చు. అయితే అప్లై చేసిన వెంటనే మనకు జాబ్‌ ఇచ్చేరు..ప్రాక్టీస్‌ మ్యాచ్‌లా కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. మీరు ఒకవేళ ఇలాంటి వాటికి ప్రీపేర్‌ కాకున్నా..మీకు తెలిసిన వారుంటే తప్పకుంటా ఆర్టికల్‌ షేర్‌ చేసి విషయం చెప్పండి.

Read more RELATED
Recommended to you

Latest news