పిల్లల ఫోన్ కి మెసేజ్ వస్తే.. పేరెంట్స్ కి నోటిఫికేషన్.. సరికొత్త టెక్నాలజీ..!

ఒకప్పుడు పిల్లలకు సెల్ ఫోన్ లు ఇవ్వడాన్ని తప్పుగా భావించిన తల్లిదండ్రులు ప్రస్తుతం కరోనా వైరస్ పుణ్యమా అని.. వద్దన్నా సెల్ఫోన్లు ఇస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు వినాలని ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అందరికీ కంప్యూటర్లు సెల్ఫోన్లు వద్దన్నా కూడా ఇస్తున్నారు తల్లిదండ్రులు. ఇక అదే క్రమంలో అతిగా సెల్ఫోన్ వాడటం ద్వారా చెడు అలవాటు వస్తాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఇకనుంచి పిల్లల తల్లిదండ్రులకు అలాంటి ఆందోళన అవసరం లేదు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పిల్లల మొబైల్స్ ఇలాంటి అసభ్యకరమైన మెసేజ్ లు వచ్చినా ఆ నోటిఫికేషన్ పేరెంట్స్ కి వచ్చే విధంగా ప్రస్తుతం సరికొత్త యాప్ రూపొందించారు బెంగళూరుకు చెందిన శాస్త్రవేత్తలు. ఇక పిల్లలకు వచ్చిన మెసేజ్ లకు సంబంధించిన నోటిఫికేషన్ తల్లిదండ్రులకు రావడంతో ఆ మెసేజ్ డిలీట్ చేయడంతోపాటు నోటిఫికేషన్ బ్లాక్ చేయడానికి అవకాశం ఉంటుంది పేరెంట్స్. బెంగళూరు సాంకేతిక సదస్సులో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు.