వాట్సప్‌లో సమస్యలున్నాయా? ఇలా ఫిర్యాదు చేయండి!

-

వాట్సాప్‌ ప్రైవసీ విషయంలో మీకు ఎలాంటి అభ్యంతరాలు, కంప్లయింట్స్‌ ఉంటే ఇకపై సులభంగా ఫిర్యాదు చేయవచ్చు. అయితే, ఎలా చేయాలి తెలుసుకుందాం. ఇటీవల ప్రైవసీ విషయంలో కేంద్రానికి వాట్సప్‌కు మధ్య వాదోపవాదాలు జరిగాయి. వాట్సాప్‌ ప్రైవసీని యాక్సెప్ట్‌ చేస్తే యూజర్ల ప్రైవసీకి ఇబ్బంది కలుగుతుందేమో నని అభ్యంతరం తెలిపారు. దీనికోసం కొత్త ఐటీ చట్టాల్లో మార్పులు చేశారు. ఇందులో భాగంగానే ఫిర్యాదుల కోసం ప్రత్యేక అధికారిని నియమించింది వాట్సాప్‌.

పరేష్‌ బీ లాల్‌ను గ్రీవెన్స్‌ ఆఫీసర్‌ ఆఫ్‌ ఇండియాగా నియమించింది. భారత ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఐటీ నిబంధనలను రూపొందించిన సంగతి తెలిసిందే. ఆ రూల్స్‌ కొద్ది రోజుల క్రితమే అమలులోకి వచ్చాయి. ఈ నయా నిబంధనల ప్రకారం సోషల్‌ మీడియా సంస్థలు గ్రైవెన్స్‌ ఆఫీసర్, నోడల్‌ ఆఫీసర్, చీఫ్‌ కంప్లయెన్స్‌ ఆఫీసర్‌ను నియమించడం తప్పనిసరి. వారంతా భారత్‌కు చెంది, ఇక్కడే నివాసం ఉన్న వారు అర్హులు.

ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నవారికి ఈ ఫిర్యాదు సులభతరం. ఎందుకంటే భారతదేశంలో కొత్త ఐటీ రూల్స్‌ ప్రకారం గ్రీవెన్స్‌ ఆఫీసర్‌ను వాట్సప్‌ నియమించింది. వాట్సప్‌ గ్రీవెన్స్‌ ఆఫీసర్‌ హైదరాబాద్‌లోనే ఉండటం విశేషం. పోస్టు ద్వారా వాట్సప్‌ ఫిర్యాదుల అధికారికి కంప్లైంట్‌ చేయొచ్చు.

వాట్సప్‌ గ్రీవెన్స్‌ ఆఫీసర్‌ అడ్రస్‌: Paresh B Lal, WhatsApp, Attention: Grievance Officer, Post Box No. 56, Road No. 1, Banjara Hills, Hyderabad & 500034, Telangana, India.పోస్టు ద్వారా ఫిర్యాదు చేయాలనుకునేవారు ఈ అడ్రస్‌కు లెటర్‌ పంపాలి.

గతంలో కూడా వాట్సాప్‌ భారతదేశంలో వినియోగదారుల ఫిర్యాదుల్ని స్వీకరించేందుకు గ్రీవెన్స్‌ అధికారిని నియమించింది. అయితే ఆ గ్రీవెన్స్‌ ఆఫీసర్‌ అమెరికాలో ఉండేవారు. కొత్త రూల్స్‌ ప్రకారం భారతదేశంలో నివసిస్తున్నవారినే నియమించాలి. దీంతో పరేష్‌ బీ లాల్‌ను నియమించింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇకపై ప్రైవసీ విషయంలో మీకు ఎలాంటి అనుమానాలు, అభ్యంతరాలు ఉన్నా వెంటనే గ్రైవెన్స్‌ ఆఫిసర్‌కు ఫిర్యాదు చేసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news