భారత్‌లోనూ యాంటీబాడీ కాక్‌టెయిల్‌!

-

కాక్‌టెయిల్‌తో కరోనాను తగ్గించవచ్చు. ఇది నిజమే! అంటే అది మామూలు కాక్‌టెయిల్‌ కాదు. అయితే, ఆ కాక్‌టెయిల్‌ ఏంటో, దాని ధరెంతో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇప్పటికే మన దేశంలో పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.ఇప్పుడు సరికొత్తగా కరోనాను తగ్గించేందుకు యాంటీబాడీ కాక్‌టెయిల్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. దీని వల్ల కరోనా సోకిన వారిలో ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే వ్యాధి మరింత పెరగకుండా చేస్తుంది. ఇప్పటికే దీన్ని అమెరికా, యూరప్‌ దేశాల్లో వాడుతున్నారు. ఇప్పుడు ఇండియాలోకీ వచ్చేసింది. న్యూయార్క్‌లోని రెజెనెరన్‌ ఫార్మాస్యూటికల్స్‌ కంపెనీ ఈ కాక్‌టెయిల్‌ను తయారుచేసింది. ఇండియాలో దీన్ని ఎమర్జెన్సీగా వాడేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి ఇచ్చింది. ఇది పబ్బుల్లో లభించే కాక్‌టెయిల్‌ టైపు కాదు. పేరు అలా పెట్టారంతే. కరోనా ఎక్కువగా ఉన్న పేషెంట్లకు దీన్ని వాడవచ్చని తెలిపారు. ఇది తాగాక… శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుందట. ఈ మందులు కరోనాతో యాంటీబాడీల్లా పనిచేస్తాయని అంటున్నారు. ముఖ్యంగా కరోనా చుట్టూ ఉండే కొవ్వు లాంటి ముళ్లను ఈ యాంటీబాడీలు నాశనం చేస్తాయని చెబుతున్నారు.


ఈ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ఒక డోసులో 600 మిల్లీగ్రాముల కాసిరివిమాబ్, 600 మిల్లీగ్రాముల ఇమ్‌డెవిమాబ్‌ ఉంటాయి. మొత్తం 1200 మిల్లీగ్రాములు ఉంటుంది. దీన్ని రోచే ఫార్మా కంపెనీ, సిప్లా ఫార్మా కంపెనీ కలిసి తయారుచేస్తున్నాయి.ఒక డోసును రూ.59,750గా ఫిక్స్‌ చేసింది.

ఉపయోగించే విధానం

  • యాంటీబాడీ కాక్‌టెయిల్‌ను కేవలం 12 ఏళ్లు దాటిన వారు, 40 కేజీల కంటే ఎక్కువ బరువు ఉన్నవారు మాత్రమే వాడాలి.
  • బాడీలో ఆక్సిజన్‌ లెవెల్‌ 90 శాతం కంటే ఎక్కువగా ఉండాలి.
    ఈ కాక్‌టెయిల్‌ను చర్మం కింద ఉండే కండరంలోకి లేదా నరాలకు ఎక్కించవచ్చు. మామూలు ఫ్రిజ్‌లలో దాచవచ్చు. గుండె సంబంధిత, డయాబెటిస్‌ వంటి వ్యాధులు ఉన్నవారు దీన్ని వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనా సోకినప్పుడు దీన్నే తీసుకున్నారు. దీన్ని వాడిన వారిలో 70 శాతం మంది 4 రోజుల్లో కరోనా నుంచి కోలుకున్నారని రోచే కంపెనీ తెలిపింది. మొదటి దశలో లక్ష ప్యాక్‌లను ఇండియన్‌ మార్కెట్‌లో రిలీజ్‌ చేశారు. జూన్‌ మధ్యలో రెండో బ్యాచ్‌ ప్యాక్‌లను వదులుతారు. ఒక్కో ప్యాక్‌ను ఇద్దరు కరోనా పేషెంట్లకు ఇవ్వొచ్చని రోచే, సిప్లా తెలిపాయి. ఈ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ వల్ల ఉన్న అదనపు ప్రయోజనం ఏంటంటే… కరోనా వచ్చిన వారు… ఇది వాడటం ద్వారా… ఆస్పత్రికి వెళ్లే అవసరం తగ్గిపోతుందని కంపెనీలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news