సొంత వ్యాపారం కోసం ఎస్‌బీఐ అందిస్తున్న రూ.9 లక్షల రుణం…!

-

ఎస్‌బీఐ వినియోగదారులకు తీపికబురు అందిస్తోంది. మీరు ఏవైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారా?  లేదా అది కూడా పౌల్ట్రీ బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నారా…? అయితే మీకు నిజంగా ఇది శుభవార్త. మీ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలను అందిస్తోంది. ఎస్‌బీఐ నుంచి పౌల్ట్రీ  లోన్ తీసుకోవచ్చు అయితే కరోనా వైరస్ దెబ్బకి చాలా మంది పై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఎంతో మంది నిరుద్యోగులు పాలయ్యారు. ఏ పనులు కూడా లేక ఆదాయం కూడా తగ్గిపోయింది.

SBI
SBI

అయితే ఇటువంటి సమయంలో చాలా మంది వ్యాపారం చేయాలని భావిస్తున్నారు. మీరు కూడా అలాగే అనుకుంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సులభంగా రుణాలను అందిస్తోంది ఎలాంటి చదువు అర్హత కూడా దీనిలో అవసరం లేదు. అయితే ఎస్‌బీఐ అందిస్తున్న రుణంతో కేవలం ఒకే వ్యాపారం చేయాల్సి ఉంటుంది. ఆ వ్యాపారమే పౌల్ట్రీ. ఇప్పుడు ఎస్‌బీఐ పౌల్ట్రీ లోన్ అందిస్తోంది. ఇలా గుడ్లు చికెన్ వంటివి అమ్ముకుని మీరు వ్యాపారం చేయవచ్చు వీటికి ఈ సంవత్సరం పొడవునా కూడా ఎంతో డిమాండ్ ఉంది

ఈ లోన్ ని ఉపయోగించుకుని మీరు పౌల్ట్రీ బిజినెస్ చేయొచ్చు. స్టేట్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని వెంటనే పని కూడా మీరు ప్రారంభించొచ్చు. అయితే పౌల్ట్రీ కి కావాల్సిన ఖర్చులు కి లోన్ వస్తుంది. మీకు అయ్యే ఖర్చులో 75 శాతం వరకు మొత్తాన్ని లోన్ రూపం లో పొందవచ్చు ఈ డబ్బు మీరు ఐదేళ్లలోపు తిరిగి చెల్లించవచ్చు అయితే ఈ లోన్ పై వడ్డీ రేటు 10.6 శాతంగా ఉంది. మీరు మీ ఓటర్ కార్డ్ , పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఆధార్ కార్డ్ , డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటిలో ఏదో ఒక దానిని ఐడెంటిటీ ప్రూఫ్ గా పెట్టవచ్చు. రూపాయలు 9 లక్షల వరకు రుణం పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news