గూగుల్ మ్యాప్స్‌ను ఇక 10 భార‌తీయ భాష‌ల్లో సుల‌భంగా వాడుకోవ‌చ్చు..!

-

సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ కు చెందిన గూగుల్ మ్యాప్స్‌ను ఇక‌పై యూజ‌ర్లు మ‌రింత సుల‌భంగా వాడుకోవ‌చ్చు. అందుకు గాను గూగుల్ త‌న మ్యాప్స్ యాప్‌కు మ‌రిన్ని మార్పులు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు భార‌తీయ భాష‌ల్లో మ్యాప్స్ అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ అందులో కొన్ని ర‌కాల ప్ర‌దేశాల‌ను వాయిస్ క‌మాండ్ల ద్వారా గుర్తించడం క‌ష్టంగా మారింది. అయితే ఇక‌పై ఆ ఇబ్బంది ఉండ‌ద‌ని గూగుల్ తెలిపింది.

now users in india can easily use google maps in their own languages

హిందీ, తెలుగు, బంగ్లా, మ‌రాఠీ, త‌మిళం, గుజ‌రాతీ, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళం, పంజాబీ, ఒడియా భాష‌ల్లో గూగుల్ మ్యాప్స్‌ను గ‌తంలో క‌న్నా ఇప్పుడు మ‌రింత మెరుగ్గా ఉప‌యోగించుకోవ‌చ్చు. వాయిస్ క‌మాండ్ల ద్వారా యూజ‌ర్లు అడిగే ప్ర‌దేశాల‌ను మ్యాప్స్ సుల‌భంగా వెదికి పెడుతుంది. ఇందుకు గాను మ్యాప్స్ యాప్‌లో కొత్త‌గా అనేక ల‌క్ష‌ల పాపుల‌ర్ ప్ర‌దేశాల‌కు చెందిన పేర్ల‌ను చేర్చారు. వాటిని వాయిస్ క‌మాండ్ల ద్వారా కూడా వెద‌క‌వ‌చ్చు.

మ్యాప్స్ లో చేసిన కొత్త మార్పుల కార‌ణంగా యూజ‌ర్ల‌కు త‌మకు స‌మీపంలో ఉన్న బ‌స్ స్టాప్‌లు, రైల్వే స్టేష‌న్లు, కిరాణా షాపులు, ఇత‌ర పాపుల‌ర్ ప్ర‌దేశాల‌ను చాలా సుల‌భంగా వెదికేందుకు వీలుంటుంది. ఆయా భార‌తీయ భాష‌ల‌కు అనుగుణంగా మ్యాప్స్‌ను తీర్చిదిద్దిన‌ట్లు గూగుల్ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news