బ్యాంకింగ్ కస్టమర్లకు చేదువార్త. నవంబర్ 1 (ఆదివారం) నుంచి పలు బ్యాంకులు కొత్త రూల్స్‌ను అమలు చేయనున్నాయి. ఇకపై కస్టమర్లు నిర్దిష్ట పరిమితికి మించి నగదు డిపాజిట్ లేదా విత్‌డ్రా చేస్తే చార్జిలను వసూలు చేయనున్నాయి. ఈ క్రమంలో కొత్త నిబంధనలు ఆదివారం నుంచి అమలులోకి వచ్చాయి.
ఇకపై సేవింగ్స్ ఖాతాదారులు నెలలో 3 సార్ల వరకు ఉచితంగా నగదు డిపాజిట్ చేయవచ్చు. ఆ లిమిట్ దాటితే ప్రతి డిపాజిట్‌కు రూ.40 వసూలు చేస్తారు. అలాగే విత్‌డ్రాయల్స్ పై కూడా లిమిట్ విధించారు. కస్టమర్లు నెలకు గరిష్టంగా 3 సార్లు మాత్రమే బ్యాంక్ నుంచి నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. పరిమితి దాటితే రూ.150 వసూలు చేస్తారు. సీనియర్ సిటిజెన్స్ కు కూడా ఈ రూల్స్ వర్తిస్తాయి. అయితే జన్‌ధన్ ఖాతాదారులు డబ్బులు డిపాజిట్ చేస్తే ఎలాంటి ఫీజు తీసుకోరు. కానీ విత్‌డ్రాకు మాత్రం రూ.100 వరకు ఫీజు చెల్లించాలి.
ఇక సీనియర్ సిటిజెన్స్ కు కరెంట్, ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్ల వారు రోజుకు గరిష్టంగా రూ.1 లక్ష వరకు ఎలాంటి ఫీజు లేకుండా డిపాజిట్ చేయవచ్చు. రూ. 1 లక్ష దాటితే ప్రతి వేయికి రూ.1 చార్జి చేస్తారు. కనీసం రూ.50 నుంచి గరిష్టంగా రూ.20వేల వరకు చార్జి వసూలు చేస్తారు.
కాగా ఈ రూల్స్ ను ఆదివారం నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా అమలు చేస్తోంది. ఇక త్వరలోనే పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్‌లు కూడా ఇవే రూల్స్ ను అమలు చేయాలని ఆలోచిస్తున్నాయి.