తెరవెనుక తలనొప్పి: రైతుల ఆవేదన ఒకెత్తు.. ఎన్నారైల రోదన మరొకెత్తు!

-

మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందిన అనంతరం అంతా రైతుల ఆవేదన గురించి మాట్లాడుతున్నారు.. రైతుల ఇబ్బందుల గురించి ప్రస్థావిస్తున్నారు.. రైతులకు ఇచ్చే భరోస గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏపీ బీజేపీ, బీజేపీ మిత్రపక్షం జనసేన, టీడీపీ, టీడీపీ రహస్య స్నేహితులైన కమ్యునిస్టు పార్టీలు అన్నీ కలిసి అమరావతి రైతుల గురించి మైకులముందు మాట్లాడుతున్నారు.. డిబేట్ లలో ప్రభుత్వానికి ఛాలెంజ్ లు చేస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ… బాబు మాటలు నమ్మి అమరావతిలో పెట్టుబడులు పెట్టిన ఎన్నారైల పరిస్థితి ఏమిటి?

అవును… ప్రస్తుతం తెరపైన కనిపించకపోయినా.. తెరవెనుక అమరావతి రైతుల ఆందోళన కంటే బలంగా వీరి ఆవేదన వ్యక్తమవుతుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. బాబు మాటలు నమ్మి రూపాయికి పదిరూపాయలు పెట్టుబడి పెట్టడంతో పాటు, కృతజ్ఞతగా టీడీపీకి పార్టీ ఫండ్ రూపంలో రుణం తీర్చుకున్న కొందరు ఎన్నారైల ఆవేదన వర్ణణాతీతం అనే మాటలు అమరావతి కేంద్రంగా వినిపిస్తున్నాయి! విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు అమరావతిలో నిర్మించతలపెట్టిన ట్విన్ టవర్స్ రేంజ్ అపార్ట్మెంట్ లలో కూడా ఎన్నారైలు విపరీతంగా పెట్టుబడులు పెట్టారని అంటున్నారు!

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… రైతులు అనేవారు ప్రభుత్వ అవసరానికి భూములు ఇచ్చారు కాబట్టి.. నేడు వారు ప్రశ్నించినా, రోదించినా, ఆగ్రహించినా, ఆక్రోశించినా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. జగన్ కూడా వారి అవసరాలను తీర్చే, వారికి న్యాయం చేసే పనులు చేయకుండా ముందుకువెళ్లే పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ… కేవలం బాబు మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టిన ఎన్నారైల గురించి ఆలోచించేదెవరు? ప్రశ్నించేదెవరు? ప్రశ్నించినా స్పందించేది ఎవరు?

ఫలితంగా… బాబు మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టిన కొందరు ఎన్నారైల పరిస్థితి.. అమరావతిలోని టెంపరరీ బిల్డింగుల్లా వారి కలలు కూడా టెంపరరీగా మారిపోయాయని, వాటికి ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి! బాబుని నమ్మి, బాబు సామర్ధ్యాన్ని నమ్మి, బాబు విజన్ ని నమ్మి ఇబ్బందులు పడుతున్న జాబితాలో… తాజాగా ఎన్నారైలు కూడా చేరినట్లయ్యిందనే మాటలు తాజాగా బలంగా వినిపిస్తున్నాయి!!

Read more RELATED
Recommended to you

Latest news