బండ్ల గణేష్ కి బిగ్ షాక్..NTR 30 టైటిల్ కొట్టేశారు !

-

ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కల్యాణ్ రామ్ – కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా .. ఎప్పుడు ఎన్టీఆర్ లుక్ బయటికి వస్తుందా .. అని అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. NTR 30 పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఎన్టీఆర్ 30 త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ చిత్ర టైటిల్ గురించి ఆసక్తికర వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. బండ్ల గణేష్ భద్రంగా దాచుకున్న టైటిల్ ఎన్టీఆర్ దోచేశాడు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ని బండ్ల భక్తితో ‘దేవర’ అని పిలుచుకుంటారు.

ఈ టైటిల్ తో మూవీ చేయాలని ఆలోచన ఆయనకు ఎప్పటి నుండో ఉంది. దేవర టైటిల్ పవన్ కళ్యాణ్ కోసం చాలా కాలం క్రితమే రిజిస్టర్ చేసి ఉంచారు. పవన్ తో సినిమా చేస్తే ఆ టైటిల్ ఫిక్స్ చేయాలని గట్టి ప్రణాళికతో ఉన్నారు. అయితే బండ్ల గణేష్ ఏళ్లుగా దాచుకుంటున్న ఆ టైటిల్ ఎన్టీఆర్ కొట్టేశాడు అంటున్నారు. త్వరలోనే ఎన్టీఆర్‌ 30 సినిమాకు దేవర అనే టైటిల్‌ ను ఫైనల్ చేసేందుకు సిద్ధం అవుతున్నారట. బండ్ల గణేష్‌ ఆ టైటిల్‌ ను రెన్యూవల్ చేయడం మరిచిపోతే,ఎన్టీఆర్‌ 30 సినిమాకు దేవర అనే టైటిల్‌ ఫిక్స్‌ కానుందట.

Read more RELATED
Recommended to you

Latest news