విశ్వక్ సేన్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం – NTR

-

విశ్వక్ సేన్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టమని NTR పేర్కొన్నారు. ధమ్కీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు జూనియర్ ఎన్టీఆర్.. ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్.. మాట్లాడుతూ… ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఈ రోజు ప్రపంచ పఠంలో నిలబడింది… ఆస్కార్ అవార్డ్ వచ్చింది అంటే రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్ ఎంత కారణమో తెలుగు చలన చి త్ర పరిశ్రమ కూడా అంతే కారణం అన్నారు.

ఆర్ ఆర్ ఆర్ కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది….ఆస్కార్ వేదిక పై చంద్రబోస్, కీరవాణి లను చూసినప్పుడు ఇద్దరు భారతీయులు ఆ అవార్డ్ తీసుకున్నారని అనిపించిందని పేర్కొన్నారు. విశ్వక్ సేన్ సినిమాలు నాకు చాలా ఇష్టమని.. తనను తాను ప్రూవ్ చేసుకోవాలని తపన పడుతూ ఉంటాడని వివరించారు. ఈ సినిమాకు డైరెక్టర్ గా కూడా అతను చేసాడు… ఇక ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తాను డైరెక్ట్ చేయకుండా ఇంకొకరికి అవకాశం ఇవ్వాలని కోరారు. తెలుగు పరిశ్రమ అద్భుతమైన స్థానంలో ఉందని… ఈ సినిమా ఉగాది కి రిలీజ్ అవుతుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news