NTR : అమెరికాలో రికార్డులు తిరగరాస్తోన్న ‘దేవర’.. నేటి సాయంత్రం ట్రైలర్ విడుదల

-

జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ విడుదలకు ముందే సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి మూడు సాంగ్స్ విడుదల అవ్వగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అతని కంపోసింగ్‌లో వచ్చి ‘చుట్టమల్లె’ సాంగ్ ఇప్పటికే 100 మిలియన్ వ్యూయర్ షిప్‌ను సంపాదించింది.దేవర మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా, దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జనతాగ్యారెజ్ మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల కాంబోలో ఇది సెకండ్ మూవీ కావడం గమనార్హం.

తాజాగా దేవర మూవీకి సంబంధించిన ట్రైలర్ ఈ రోజు (మంగళవారం) సాయంత్రం 5.04 గంటలకు విడుదల కానుంది. అయితే, సినిమా విడుదలకు 17 రోజుల ముందే నార్త్ అమెరికా అడ్వాన్స్ అమ్మకాల్లో 1.05 మిలియన్ డాలర్లకు మూవీ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.ట్రైలర్ కూడా విడుదల కాకుండా అడ్వాన్స్ సేల్స్‌లో 1 మిలియన్ డాలర్ల మార్కును దాటిన తొలి భారతీయ చిత్రంగా దేవర నిలిచింది. కాగా, నేటి సాయంత్రం ట్రైలర్ రిలీజ్ కానుండగా ఈ మూవీలోని కాస్టింగ్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొనే చాన్స్ ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version