Guntur POCSO Court announced the verdict: గుంటూరు పోక్సో కోర్టు…సంచలన తీర్పు ప్రకటించింది. ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన, పాస్టర్ కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది గుంటూరు పోక్సో కోర్టు. 2017 నవంబర్ 18 న ప్రార్థనల కోసం అని పిలిచి, మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు పాస్టర్ నీలం కోటేశ్వరరావు. ఈ తరుణంలోనే తీవ్ర అనారోగ్యానికి గురై, గర్భవతిగా మారింది మైనర్ బాలిక.
ఇక బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో, కేసు నమోదు అయింది. ఈ కేసును పోలీసులు విచారణ చేసి.. పాస్టర్ నీలం కోటేశ్వరరావును అరెస్ట్ చేశారు. ఇక విచారణ లో నిందితుడు పాస్టర్ నీలం కోటేశ్వరరావు అత్యాచారం చేశాడని తేలింది. ఈ కేసు రుజువు కావడంతో గుంటూరు పోక్సో కోర్టు…సంచలన తీర్పు ప్రకటించింది. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష ,లక్ష రూపాయల జరిమానా విధిస్తూ, తీర్పు చెప్పింది గుంటూరు పోక్సో కోర్టు.