Das Ka Dhamki : విశ్వక్ కోసం జూనియర్ ఎన్టీఆర్ !

-

యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ‘దాస్ కా దమ్కీ’ మూవీ చేస్తున్నాడు. కామెడీ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి బెజవాడ ప్రసన్నకుమార్ కథని సమకూరుస్తున్నాడు. నివేదా పేతురాజు మరోసారి విశ్వక్ తో కలిసి నటించబోతుంది.

అయితే, విశ్వక్సేన్ నటించిన ‘దాస్ కా దమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 17న నిర్వహించేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన వచ్చే సమయాన్ని బట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ లో మార్పు ఉండొచ్చని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news