RC 15 : ‘CEO’ గా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ?

-

ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్య ఫ్లాప్ అవడంతో చరణ్ నుంచి సాలిడ్ హిట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్తో ఆర్సి15 మూవీ తెరకెక్కిస్తున్నారు. శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్, కియారా అద్వానీ జోడీగా నటిస్తున్న RC15 మూవీకి ‘CEO’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నారట. ఇందులో చెర్రీ ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మెజార్టీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర, SJ సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news