ఇండియా-ఆస్ట్రేలియా మూడో టెస్ట్ కు ఆతిథ్యం ఇచ్చిన ఇండోర్ పిచ్ కు ఐసీసీ ‘పూర్’ రేటింగ్ ఇవ్వడంపై బీసీసీఐ ఆపిల్ చేయనుంది. మూడు డీమెరిట్ పాయింట్లు కూడా ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం చేయనుంది. ఏదైనా వేదికకు ఐదేళ్ల వ్యవధిలో ఐదు, అంతకంటే ఎక్కువ డిమెరిట్ పాయింట్లు వస్తే ఏడాది పాటు అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించకుండా నిషేధం విధిస్తారు.
ఈ క్రమంలోనే ఇండోర్ పిచ్ పై బీసీసీఐ తమ వాదనలు వినిపించనుంది. ఇక అటు భారత్-ఆస్ట్రేలియా మధ్య మార్చి 19న విశాఖపట్నం వేదికగా జరగనున్న రెండో వన్డే మ్యాచ్ టికెట్లను శనివారం నుంచి విక్రయించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. మార్చి 10 నుంచి పేటియం వేదికగా టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఏసిఏ సెక్రటరీ ఎస్.గోపీనాథరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
13 నుంచి ఆఫ్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈసారి మూడు కేంద్రాల్లో టికెట్ల విక్రయాలు చేపడుతున్నామని, ఎక్కడెక్కడ అనేది త్వరలోనే తెలియజేస్తామన్నారు. టికెట్ల ధరలు రూ.600, రూ.1500, రూ.2000, రూ.3000, రూ.3500, రూ.6000గా నిర్ణయించామని పేర్కొన్నారు.