నానీకి ఎన్టీఆర్ ట్రస్ట్ సెల్యూట్…!

-

కరోనా వైరస్ నేపధ్యంలో రక్త దానం అనేది చాలా అవసరం అవుతుంది. రక్తం కొరత బాగా ఉంది ఇప్పుడు. ఎవరూ కూడా రక్తదానం చేయడానికి ముందుకి వచ్చే పరిస్థితి కనపడటం లేదు. ఈ తరుణంలో హీరో నానీ రక్తదానం చేయడానికి ముందుకి వచ్చాడు. తన భార్య తో కలిసి ఎన్టీఆర్ ట్రస్ట్ లో రక్తదానం చేసాడునానీ. రక్తదానం చేయడానికి అందరూ ముందుకి రావాలని కోరాడు.

దీనిపై ఎన్టీఆర్ ట్రస్ట్ అతన్ని అభినందించింది. ఈ మేరకు ఒక ట్వీట్ కూడా చేసింది ఎన్టీఆర్ ట్రస్ట్. ఆయన ఇచ్చిన రక్తం ఎంతో మంది జీవితాల్ని కాపాడుతుందని, ప్రత్యేకించి తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు ఈ రక్తం ఎంతో అవసరమని త్విట్ట్ర్ లో పేర్కొంది. రక్తదానం చేసిన సమయంలో నాని ఇచ్చిన సందేశం వీడియోను కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ పోస్ట్ చేసింది. నానీకి సెల్యూట్ చేసింది.

ఇక నానీ కూడా దీనిపై స్పందించాడు. మన చుట్టూ పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని నానీ అన్నాడు. అందుకే అందరం ఇంట్లో ఉన్నామన్న నానీ… కానీ మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. తలసేమియాతో వేల మంది చిన్నారులు బాధపడుతున్నారని… వారికి రక్తం చాలా అవసరమని చెప్పాడు. వారికే కాదు.. ఆపరేషన్లకు, ఇతర చికిత్సలకు రక్తం కావాలన్న నానీ…

కొవిడ్‌-19 వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో చాలా మంది బయటికి వచ్చి రక్తం ఇవ్వడానికి భయపడిపోతున్నారని పేర్కొన్నాడు. అసలు దీనికి, కొవిడ్‌-19కు ఎటువంటి సంబంధం లేదన్నాడు. ఇంతకుముందు కంటే ఈ సమయంలో రక్తదానం చాలా అవసరమని అభిప్రాయపడ్డాడు. మీరు కూడా దానం చేసి, జీవితాల్ని రక్షించండని నానీ కోరారు. ఇక తెలంగాణా ప్రభుత్వం విషయంలో రక్తం ఇచ్చే వాళ్ళ ఇంటికే వెళ్లి రక్తం తీసుకోవాలి అని భావిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version