ప్రపంచ ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్ తో పోరాడటానికి ప్రభుత్వాలు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. రోజురోజుకీ ఈ వైరస్ బలపడుతున్న నేపథ్యంలో ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనిపెట్టడానికి రాత్రింబవళ్లు తెగ పరిశోధనలు జరుపుతున్నారు. ప్రస్తుతానికైతే మందు గాని, వ్యాక్సిన్ గాని లేకపోవడంతో నియంత్రణ ఒకటే మార్గమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. దీంతో కరోనా వైరస్ నుండి ప్రజలను కాపాడటానికి చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఇంతటి ప్రమాదకరమైన వ్యాధితో పోరాడుతూ చికిత్స అందిస్తున్న వైద్యులను దేవుళ్లతో కొలుస్తున్నారు. చాలా దేశాల్లో వైద్య సిబ్బంది చేస్తున్న సేవల పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మె నోటీసులు ఇవ్వడం తీవ్ర దుమారంరేపింది.తమను రెగ్యులరైజ్ చేయాలని.. లేదంటే కాంట్రాక్ట్ పద్ధతిలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేయడం విస్తుగొలుపుతోంది. అంతేకాకుండా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. అసలు మానవత్వం గా సేవలు అందించాల్సిన ఇటువంటి సమయంలో ఇలాంటి డిమాండ్లు ఎవరైనా చేస్తారా అని ఔట్ సోర్సింగ్ సిబ్బంది పై రాజకీయ విమర్శలు వస్తున్నాయి. మరోపక్క ఔట్ సోర్సింగ్ సిబ్బంది సేవలు అందించకుండా ఉండటంతో గాంధీ హాస్పిటల్ లో కరోనా వైరస్ పేషెంట్లు అనేక అవస్థలు పడుతున్నారు. దీంతో ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితిలో కి వెళ్ళిపోయింది.
తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా రోజురోజుకు అనేక నష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో…ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఈ విధంగా సమ్మెకు దిగుతాం అని అనటం సమంజసమా అని అంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మె కి ఓకే అంటే… పేషెంట్ లకి కోపం వచ్చేలా ఉంది. వద్దు అని నర్స్ లకి చెప్పాలని ప్రయత్నాలు చేస్తున్న కోపగించు కుంటున్నారు. నయాపైసా తెలంగాణ ఖజానా కి రాని పరిస్థితిలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది…చేస్తున్న డిమాండ్లపై రాజకీయంగా మాత్రమే కాదు ప్రజల నుండి కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.