కళ్లు ఎర్రగా మారితే కరోనా వ‌చ్చినట్టా..? తెర‌పైకి వ‌చ్చిన కొత్త విష‌యాలు..!!

-

క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్-19.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే పేరు విన‌పడుతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 21 లక్షలు దాటాయి. మ‌రియు 1,45,551 మందికిపైగా మృత్యువాత ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఈ లెక్క‌లు చూస్తుంటే ప‌రిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఇప్ప‌టికే ఈ క‌రోనా మ‌హ‌మ్మారిని మ‌ట్టుపెట్టేందుకు పలు దేశాల్లో లాక్‌డౌన్ కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నిషేధాజ్ఞలు విధించి ప్రజలను ఇళ్ల నుంచి రాకుండా ఆంక్షలు కూడా జారీ చేస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ, వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతోంది.

ఇదిలా ఉండే.. సాధార‌ణంగా ఈ వైరస్‌ సోకిన వ్యక్తికి జలుబు, జ్వరం, దగ్గు, ఛాతీలో నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. తర్వాత తీవ్రమైన న్యుమోనియాకు దారితీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే ఇప్పుడు తెర‌పైకి మ‌రో కొత్త విష‌యం వ‌చ్చి చేరింది. కళ్లు ఎర్రగా మారినా క‌రోనా వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ట‌. ఈ మేర‌కు అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తల్మాలజీ పరిశోధకులు వెల్ల‌డించారు.

వీరి వివ‌రాల ప్ర‌కారం.. కళ్లు ఎర్రగా మారి, దురదా, కంటిగుడ్డు వాపుగా అనిపించినా కరోనా లక్షణం కిందే చెప్పుకోవ‌చ్చ‌ని అంటున్నారు. అంతేకాదు.. చైనాలో కరోనా బారినపడిన వారిలో మూడో వంతు మందిలో ఇలాంటి ల‌క్ష‌ణాలు వైద్యులు గుర్తించారని కూడా వెల్ల‌డించారు. అలాగే ఓ వ్యక్తికి కళ్ల ద్వారా కరోనా సోకిందని కూడా ఈ ప‌రిశోధ‌కులు తెలిపారు. అయితే అధికారికంగా దాన్ని ధ్రువీకరించనప్పటికీ, కన్నీళ్ల ద్వారా కరోనా వైరస్ సోకుతుందని మాత్రం కచ్చితంగా చెప్పగలమని వాళ్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news