మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ఉంది.. సంప్రదింపులతోనే సమస్యలకు పరిష్కారమని.. సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటుకు ఎంపిక చేసుకోవడానికి కారణాలు ఉన్నాయని ఎన్వీ రమణ అన్నారు. ఇక్కడ ఫార్మా, ఐటి, ఇతర పరిశ్రమలు ఉన్నాయని.. హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని కొనియాడారు.
నగరంలోని హెచ్ ఐసీసీ నోవాటెల్ లో ఏర్పాటు చేసిన ఇంటర్నరేషనల్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ సదస్సులో సీజేఐ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ… ఈ సెంటర్ ఏర్పాటు ఆలోచన గురించి కేసీఆర్ తో ప్రస్తావించినప్పుడు సానుకూలంగా స్పందించారన్నారు. సీఎం కేసీఆర్ , తెలంగాణ ప్రభుత్వ సహకారం లేకుండా సెంటర్ ఏర్పాటు సాధ్యం అయ్యేది కాదని వెల్లడించారు. డిసెంబర్ 18 న ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ హైదరాబాద్ లో ప్రారంభోత్సవ అని తెలిపారు ఎన్వీ రమణ. ఆర్బిట్రేషన్ కేంద్రానికి హైదరాబాద్ అన్ని విధాలా అనువైన ప్రాంతం అని తెలిపారు.