గవర్నర్ ఫోన్ ట్యాపింగ్ పై NVSS ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు

-

మొయినాబాద్ ఫాంహౌజ్ ఫైల్స్ బయటకు రావడంతో కేసీఆర్ కు నిద్రపట్టలేదని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. పోలీసు వ్యవస్థను పూర్తిగా రాజకీయమయం చేశారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మూణ్నెళ్లుగా పాలన స్తంభించిందని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఫోన్‌లను ట్యాప్ చేస్తున్న విషయాన్ని.. ప్రైవేటుగా కలిసినప్పుడు చెబుతున్నారని ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ తెలిపారు.

అందరూ ఫోన్ ట్యాపింగ్ అంటున్నారని.. చివరకు గవర్నర్‌ కూడా తన ఫోన్ ట్యాపింగ్ అవుతున్నట్లు అనుమానం వ్యక్తం చేశారని ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ చెప్పారు. ఈ వ్యవహారమంతా సీఎంవో కనుసన్నల్లో నుంచే జరుగుతుందని ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై ఉన్నతస్థాయి న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను తెరాస సర్కారు ఆధోగతి పాలు చేసిందని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో ధరణి తెచ్చి భూములు తారుమారు చేశారని ప్రభాకర్ విమర్శించారు. తద్వారా రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అంతే కాకుండా ధరణి పేరు చెప్పి భూములను టీఆర్ఎస్ నాయకులు మాయం చేస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version