కరోనా చికిత్సను బుజాల పై వేసుకొని ఉచితంగా చికిత్స అందిస్తున్నారు అధికారులు. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ను నివారించేందుకు వారికి తోచినంత కృషి చేస్తూన్నారు. క్వారంటైన్ సెంటర్ ల సంఖ్య ను పెంచుతున్నారు మెరుగైన వైద్యం అందిస్తున్నారు కానీ రొగులు మాత్రం క్వారంటైన్ సెంటర్ ను జైల్ లాగా చూస్తున్నారు. పది రోజులు క్వారంటైన్ లో ఉండేందుకు నానా అవస్తాలు పడిపోతున్నారు. సందు దొరికితే తప్పించుకొని పారిపోతున్నారు అటువంటి వారిని దృష్టి లో పెట్టుకొని ఒడిశా ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. క్వారంటైన్ లో పది రోజులు పూర్తిగా ఉంది వైద్యులకు సహాయపడితే వారికి 2000 ఇన్సెంటివ్ ను ప్రకటించింది. దీంతో రొగులు దెబ్బకు దారిలోకి వచ్చారు వైద్యులకు సహాయా పడుతున్నారు ఇన్సెంటివ్ లు కొట్టేస్తున్నారు ఇప్పటికే ఈ పథకాని కింద ఒదిశా ప్రభుత్వం 54 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ పథకం అద్భుతంగా పని చేస్తుందని దేశ వ్యాప్తంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పై హర్షాలు వ్యక్తమవుతున్నాయి.
బంపర్ ఆఫర్…! క్వారాంటైన్ లో ఉండండి 2000 సొంతం చేసుకోండీ..!
By anurag s
-
Previous article