కేటీఆర్ పై ఉత్తమ్ పొగడ్తల వర్షం.!

తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఈ చార్యతో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్డీవో కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా త్వరలోనే హైదరాబాద్-విజయవాడ హైస్పీడ్ ట్రైన్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ నగరాల మధ్య రైలు వస్తే జాతీయ రహదారి వెంబడి బాగా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. కాగా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, ఇద్దరూ సరదాగా గడిపారు.

టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐదేళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్తమ్ కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. మరోవైపు కేటీఆర్ పై ఉత్తమ్ ప్రశంసలు కురిపించారు. కేటీఆర్ డైనమిక్ లీడర్ అంటూ కితాబునిచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆ కార్యక్రమానికి హాజరైన నేతలు, కార్యకర్తలు షాక్ అయ్యారు. అనంతరం షాక్ నుంచి తేరుకుని చప్పట్లతో కొట్టారు.