ఈ హీరోయిన్స్​కు ఆఫర్లు తక్కువ.. సోషల్​మీడియాలో గ్లామర్​ డోస్​ ఎక్కువ!

-

సాధారణంగా సినీపరిశ్రమలో హీరోయిన్లు ఎక్కువ కాలం మనుగడ కొనసాగించడం కష్టమనే చెప్పాలి. ఏదైనా స్పెషల్​ టాలెంట్​ ఉంటేనో లేదా అదృష్టం ఉంటేనో తప్ప.. ఎక్కువ ఛాన్స్​లు అందుకునే అవకాశం ఉండదు. అయితే ఇప్పుడు ఆఫర్లు తగ్గిపోతున్న ముద్దుగుమ్మలకు సోషల్​మీడియా ఓ వరంగా మారింది. దీంతో ఆ భామలంతా హాట్​ట్రీట్​నే నమ్ముకున్నారు! అందాల ఆరబోతలో జోరు పెంచి… అభిమానులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. వారికి మైండ్​ బ్లాక్​ చేస్తున్నారు. అలానే దర్శకనిర్మాతలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ఓ సారి ఆ భామలెవరో చూద్దాం…

ప్రియాంక జవాల్కర్​.. షార్ట్​ఫిల్మ్స్​తో పాపులర్​ అయిన అనంతపురం అమ్మాయి ప్రియాంక జావల్కర్‌.. ‘టాక్సీవాలా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమాతోనే హిట్‌ అందుకున్న ఆమె ‘తిమ్మరుసు’, ‘ఎస్‌ ఆర్‌ కళ్యాణమండపం’, ‘గమనం’ చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఒక్క సినిమా లేదు కానీ సోషల్​మీడియాలో మాత్రం.. హాట్‌ అందాలను తెగ ఆరబోస్తోంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాత్రం ఆచితూచి మంచి సినిమాలు మాత్రమే చేస్తానని చెప్పింది.

నివేతా పేతురాజ్‌.. రీసెంట్​గా ‘విరాటపర్వం’లో అలా కనిపించి మాయమైన నివేదా పేతురాజ్​.. చేతిలో ప్రస్తుతం ఒక్క సినిమా మాత్రమే ఉంది. విశ్వక్​సేన్​తో ‘ధమ్కీ’ చిత్రంలో నటిస్తోంది. అయితే సామాజిక మాధ్యమాల్లో మాత్రం గ్యాప్​ లేకుండా అదిరేపోయే ఫొటోషూట్లను పోస్ట్​ చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది.

నిధిఅగర్వాల్​.. ‘సవ్యసాచి’తో ఎంట్రీ ఇచ్చి.. ఇస్మార్ట్ శంకర్​తో ఒక్కసారిగా క్రేజ్​ సంపాదించుకున్న బ్యూటీ నిధి అగర్వాల్​. ప్రస్తుతం పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​తో ‘హరిహరవీరమల్లు’తో పాటు ఓ తమిళ సినిమా చేస్తోంది. ఈ రెండు ప్రకటించి కూడా చాలా కాలం అయింది. ఆ తర్వాత కొత్త ప్రాజెక్ట్​లను ప్రకటించలేదు. ఇప్పుడీ ముద్దుగుమ్మ అందాల ఫొటో షూట్లకే పరిమితమైనట్లు కనిపిస్తోంది.

నభానటేష్​.. ఇస్మార్ట్​ శంకర్​తో యూత్​లో క్రేజ్​ దక్కించుకున్న మరో బ్యూటీ నభా నటేష్​. డిస్కోరాజా, సోలో బ్రతుకే సో బెటర్​, అల్లుడు అదుర్స్​, మ్యాస్ట్రో.. ఇలా ఆమె నటించిన వరుస సినిమాలు అంతగా ఆడకపోవడం వల్ల ఈమె కూడా ఫొటోషూట్లకే పరిమితమైనట్లు కనిపిస్తోంది.

ఈషారెబ్బా.. ఇండస్ట్రీలో మరో హాట్​ బ్యాటీ ఈషా రెబ్బా. ‘అ!’, ‘అరవింద సమేత..’, ‘సుబ్రహ్మణ్యపురం’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి ఈషా రెబ్బా. ఓటీటీల్లోకి అడుగుపెట్టి ‘పిట్టకథలు’, ‘త్రీ రోజెస్‌’ లాంటి వెబ్‌ సిరీస్‌ల్లోనూ సందడి చేసింది. అయితే ప్రస్తుతం ఈ భామ చేతిలో తెలుగు చిత్రాలే లేవు. తమిళ, మలయాళంలో రెండు చిత్రాలు చేస్తోంది. అవి కూడా ఎప్పుడో ఒప్పుకుంది. ఈమె సోషల్​మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలు చూస్తే నెటిజన్లకు నిద్ర కూడా పట్టదు.

ప్రియా ప్రకాశ్​.. కొంటెగా కన్నుగీటి.. కుర్రకారు హృదయాలు కొల్లగొట్టి.. ఓవర్‌నైట్‌లోనే స్టార్‌ అయ్యింది కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. వింకిల్‌ గర్ల్‌గా ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్న ఈ నటి తెలుగులో చెక్​, ఇష్క్​ చిత్రాలతో సందడి చేసింది. కానీ ఈ అమ్మడు అవకాశాలు మరి చాలా తక్కువగానే వచ్చాయనే చెప్పాలి. ప్రస్తుతం వివిధ భాషల్లో మూడు ప్రాజెక్ట్​లు చేస్తున్నప్పటికీ.. ఆమెకు వచ్చిన క్రేజ్​ అవి తక్కువే. దీంతో ఆమె కొంతకాలంగా మతిపోయే ఫొటోలను పోస్ట్​ చేస్తూ మైండ్ బ్లాంక్​ చేస్తోంది.

లావణ్య త్రిపాఠి.. అందం.. అభినయంతో ఆకట్టుకున్న ఉత్తరాది సోయగం లావణ్య త్రిపాఠి. ఇటీవలే ఆమె నటించిన ‘హ్యాపీబర్త్​డే’ ఆడలేదు. సినిమా ఆఫర్లలో అంతకుముందు ఉన్న జోరు ప్రస్తుతం కనపడట్లేదు. దీంతో ఈమె కుడా అందాల ఎర చూపుతూ ఫాలోయింగ్​ను పెంచుకుంటోంది.

ప్రగ్యాజైశ్వాల్​.. తొలి అడుగుల్లోనే ప్రతిభ చాటింది ప్రగ్యా జైస్వాల్‌. ‘కంచె’ చిత్రంతో ఆమె చక్కటి అభినయం ప్రదర్శించింది. అయితే ఆ తర్వాత ఆమె కెరీర్​ అంత సాఫీగా సాగలేదు. కెరీర్‌లో విజయాన్ని సొంతం చేసుకునేందుకు ఎంతో ప్రయత్నించిన ఆమెకు ఎట్టకేలకు ఇటీవలే ‘అఖండ’తో దక్కింది. దీంతో ఈ భామ మళ్లీ సక్సెస్​ ట్రాక్​ ఎక్కుతది అని అనుకున్నా.. ఇంకా ఒక్క కొత్త ప్రాజెక్ట్​ కూడా ప్రకటించలేదు. కానీ నెట్టింట్లో మాత్రం అందాల విందు వడ్డించేస్తోంది.

పాయల్​ రాజ్​పుత్​.. ‘ఆర్​ఎక్స్​ 100’ కుర్రాళ్ల మతిపోగొట్టిన భామ పాయల్​ రాజ్​పుత్​. ఎన్ని ప్రయత్నాలు చేసినా స్టార్​ హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం ఈమె నటించిన ‘తీస్​మార్​ ఖాన్’​ విడుదలకు రెడీగా ఉండగా.. మంచు విష్ణుతో కలిసి జిన్నా మూవీ చేస్తోంది. ఇవి ఖాళీ అయితే ఆమె చిత్రాలో లేవు.

అదాశర్మ.. హార్ట్​ ఎటాక్​తో ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ భామ.. ప్రస్తుతం పూర్తిగా సోషల్​మీడియాకే పరిమితమైంది. వింత వింత డ్రెస్సులు ధరిస్తూ, పోజులు ఇస్తూ కనువిందు చేస్తోంది. అప్పడప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తోంది.

ఇంకా ఈ జాబితాలో ఒక్కప్పుడు తెలుగులో స్టార్​ హీరోయిన్​గా రాణించిన మీరాజాస్మిన్​, ఇలియానాతో పాటు ఒకటి రెండు చిత్రాల్లో నటించిన నెహా శర్మ కూడా సోషల్​మీడియాలో గ్లామర్​ డోస్​ ఫుల్​గా పెంచేశారు. స్క్రిన్​ షోలో రెచ్చిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news