జపాన్ మాజీ ప్రధాని షింజో అబే ఇకలేరు. దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. శుక్రవారం ఆయన లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో ఉండగా.. ఉన్నట్టుండి కిందపడిపోయారు. అదే సమయంలో గన్ పేలిన శబ్దం వినిపించింది. రక్తం మడుగులో ఉన్న ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
కానీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాల్పులు జరిపిన ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆయనపై కాల్పులు ఎందుకు జరిపారు, దుండగుడు ఎవరు అన్నది తేలాల్సి ఉంది.