వేలాది మందికి వైద్యం చేసిన డాక్టర్, అనాధ శవంగా…!

-

కరోనా ప్రభావం ఏమో గాని ఇప్పుడు దేశ వ్యాప్తంగా అనేక హృదయ విదారక దృశ్యాలు బయటకు వస్తున్నాయి. మానవత్వం అనేది కరోనా వైరస్ పూర్తిగా చంపేసింది. 52 ఏళ్ళ యునానీ వైద్యుడు పాత బస్తీలో ఒక క్లీనిక్ ని నిర్వహిస్తున్నారు. పేదలు, పెద్ద వారు అనే తేడా లేకుండా ఆయన చికిత్స చేస్తూ ఉంటారు. అలాంటిది ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఎలా వచ్చిందో తెలియదు ఆయన చనిపోయాడు.

కుటుంబ సభ్యులను క్వారంటైన్ చేసారు అధికారులు. గాంధీలో ఉన్న ఆయన కుటుంబం, హోంక్వారంటైన్‌లో ఉన్న బంధుమిత్రులు ఖననం చేసే పరిస్థితి లేదు. దీనితో మున్సిపల్ సిబ్బంది అందుకు ఏర్పాట్లు చేసారు. ఈ నెల 11న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావడంతో నాంపల్లి ఆస్పత్రికి వెళ్ళగా అక్కడి నుంచి ఆయన బంజారా హిల్స్ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకుని వెళ్ళారు. ఆయనకు 13 న కరోనా అని గుర్తించారు.

ఆయన్ను కుటుంబ సభ్యులను గాంధీకి తరలించగా… అందరికీ పాజిటివ్‌ అని వెల్లడైంది. ఆయన మంగళవారం చనిపోయారు. భార్య, తల్లి, సోదరి, సోదరునికి సైతం కరోనా ఉందని అధికారులు పేర్కొన్నారు. క్లీనిక్‌కు నాంపల్లి, మాసాబ్‌ట్యాంక్‌, ఏసీ గార్డ్స్‌ నుంచి పెద్దఎత్తున రోగులు వస్తారు. మార్చ్ 26 నుంచి ఆయన క్లీనిక్ ని మూసివేసారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులకు ఆయన చివరి చూపు కూడా లేదు.

Read more RELATED
Recommended to you

Latest news