కరోనా కారణంగా చిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా నెలకొన్ని పరిస్థితులతో సినీ కార్మీకులందరూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. లాక్ డౌన్ తో షూటింగ్స్ అన్ని ఆగిపోయిన సంగతి తెలిసిందే. షూటింగ్స్ లేకపోతే వీరందరికి ఇళ్ళు గడవడం పూట గడవడం చాలా కష్టం. అందుకే వీళ్ళకు అండగా ఉండి ఆదుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ (సీ సీ సీ) పేరుతో చిరంజీవి ఆధ్వర్యంలో ఒక సంస్థ ఏర్పడి సినీ కార్మికుల అవసరాలను తీర్చుతున్న విషయం తెల్సిందే. ఈ విషయంలో స్వయంగా చిరంజీవి అందరికి ఫోన్ కాల్ ద్వారా విరాళాలు అందివ్వమని కోరుతున్నారు. దాంతో చాలా మమది హీరో హీరోయిన్స్ ఇతర నటీ నటులు, నిర్మాతలు తమవంతు సహాయ్యాని అందిస్తున్నారు.
ఇప్పుడు ఇందులో యాక్షన్ హీరో గోపీచంద్ కూడా చేరారు. రీసెంట్ గా గోపీచంద్ 2000 కుటుంబాలకు రోజువారీ అవసరాలకు సంబంధించిన వస్తువులతో పాటు కిరాణా వస్తువులను స్వయంగా తానే ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే 1500 మంది సభ్యులున్న అనాథాశ్రమానికి రెండు నెలల పాటు ప్రతి రోజూ ఆహారాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కు 10 లక్షల రూపాయిలు విరాళంగాను ఇచ్చారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలోని 24 శాఖల కార్మికుల్లోని పేదలకు సరుకుల్ని పంపిణీ చేస్తున్నారు. సినీపరిశ్రమలో ప్రతి కార్మికుడికి ఇంటికి నెలకు సరిపడా బియ్యం-పప్పు ఉప్పు గ్రాసరీల్ని అందిస్తున్నారు. గత నెల హైదరాబాద్ చుట్టు పక్కల కల కూకట్ పల్లి, మియాపూర్, వనస్థలిపురం, సైనిక్ పురి వంటి ప్రాంతాలలో దాదాపు 12000 కుటుంబాలకి నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. ఇలాగే మరో రెండు నెలలపాటు కూడా అందివ్వాలనుకుంటున్నట్టు చిరంజీవి తెలిపారు.