అమ్మ బామ్మోయ్.. నీ టాలెంట్ కు విజిల్ వెయ్యాల్సిందే..

-

ముప్పై ఏళ్లు రాగానే చాలామంది కొంత దూరం నడవాలంటే అయ్యో రామ అంటారు. అది నిజమే కదా.. ఈరోజుల్లో ఆహార శైలిలో మార్పు, వాతావరణ పరిస్థితులు జనాల ఆరోగ్యం పై అంతలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి.. కానీ 50 పైబడిన కొందరు వృద్ధులు వయస్సు పెరిగిన ఒంట్లో సత్తా తగ్గలేదు అంటూ నిరూపిస్తున్నారు. తాజాగా ఓ బామ్మ అదిరిపోయే విన్యాసాలు చేస్తూ ఔరా అనిపించింది.. అది కూడా నేల మీద కాదు గాల్లో.. ఆలస్యం లేకుండా ఆ బామ్మ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

కేరళకు చెందిన ఒక బామ్మ మాత్రం 67 ఏళ్ల వయసులో కూడా అదరగొడుతోంది..దీనికి సంబంధించిన వీడియోను ఒక సోషల్ మీడియాలో షేర్ చేయగా, నెటిజన్ల నుంచి అద్భుత స్పందన వస్తోంది. ఆ బామ్మ టాలెంట్‌కు, ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ బామ్మకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియకపోయినప్పటికీ, వీడియో చూస్తే ఆమె కష్టం ఎలాంటిదో అర్థమవుతుంది.

సాధారణంగా రోప్ సైక్లింగ్ చేయడం కొంచెం కష్టమైన పనే. ఎందుకంటే చిన్న తాడుపై, చాలా ఎత్తులో సైకిల్ తొక్కాల్సి ఉంటుంది..మామూలు వాళ్ళు చెయ్యడమే కష్టంగా భావిస్తారు. కిందికి చూస్తేనే కొందరికి కళ్లు తిరుగుతాయి. పైగా ఆ రోప్ తెగిందంటే కింద పడి గాయాలు కూడా కావొచ్చు. అంత ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ ఆ బామ్మ మాత్రం ధైర్యంగా రోప్ సైక్లింగ్ చేస్తోంది.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. ఆ బామ్మ ధైర్యాన్ని మెచ్చుకుంటూ వావ్ అంటున్నారు.. అందరిని ఆకట్టుకుంటున్న ఆ వీడియోను మీరు ఒకసారి చూడండి..

https://www.instagram.com/reel/CohoXopjt-Z/?igshid=YmMyMTA2M2Y=

Read more RELATED
Recommended to you

Exit mobile version