ఢిల్లీలో ఆంక్షలు కఠినతరం… ప్రైవేట్ సంస్థల మూసివేత… ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్

-

పెరుగుతున్న కరోనా, ఓమిక్రాన్ కేసులు తీవ్రత వల్ల ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఢిల్లీలో ఆంక్షలను మరింత కఠిన నిర్ణయం తీసుకుంది కేజ్రీవాల్ ప్రభుత్వం. ఇప్పటికే ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది. తాజాగా ఢిల్లీలోని అన్ని ప్రైవేటు సంస్థలను మూసివేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. ఉద్యోగులంతా వర్క్ ఫ్రం హోమ్ చేయాలని ఆదేశాలను జారీ చేసింది. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతించింది. అన్ని రెస్టారెంట్లు, బార్లను క్లోజ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. రెస్టారెంట్లు కేవలం డెలవరీ, పార్సిళ్లకు మాత్రం అనుమతి ఇచ్చింది.

గత కొద్ది రోజులుగా ఢిల్లీలో ఓమిక్రాన్, కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి కేసుల సంఖ్య 15 వేలను దాటుతున్నాయి. పాజిటివిటీ రేటు కూడా 23కు చేరడంతో ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలను కఠిన తరం చేసింది. అనుమతులు లేకుండా బయటకు వచ్చేవారి కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news