ఇండియాలో 77కు చేరిన ఓమిక్రాన్ కేసులు…

-

దేశంలో ఓమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. గత మూడు రోజుల్లోనే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. డెల్టా వేరియంట్ కన్నా ఫాస్ట్ గా విస్తరిస్తుండటం ప్రజలను, ప్రభుత్వాలను కలవరపెడుతోంది. తాజాగా ఈరోజు మరో 4 ఓమిక్రాన్ కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి. దీంతో ఓమిక్రాన్ కేసుల సంఖ్య ఢిల్లీలో 10కి చేరింది. దేశవ్యాప్తంగా ఓమిక్రాన్ కేసుల సంఖ్య 77కు చేరుకుంది. వేరే రాష్ట్రాల్లో కూడా ఓమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.

దేశంలో ఓమిక్రాన్ కేసులను చూస్తే ఇప్పటి వరకు మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 32, రాజస్థాన్ లో 17, ఢిల్లీలో 10, కేరళలో 5, తమిళనాడులో 1, ఏపీలో 1, చంఢీగడ్ లో 1, కర్ణాటకలో 3, బెంగాల్లో 1, తెలంగాణలో 2, గుజరాత్ లో 4 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు వచ్చిన కేసులన్నీ దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, టాంజానియా, కెన్యా, సోమాలియా , ఐర్లాండ్ దేశాల నుంచి వచ్చిన వారికే వచ్చాయి. ముఖ్యంగా ఏయిర్ పోర్టుల వద్ద ఎట్ రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చే వారికి ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తున్నారు. ఒకవేళ పాజిటివ్ వస్తే జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news