గ్రూప్ కెప్టెన్ వరుణ్‌సింగ్‌కు ఏయిర్ ఫోర్స్ తుది వీడ్కోలు

ఇండియన్ ఏయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ భౌతికకాయానికి మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ ఎయిర్ పోర్టులో ఐఏఎఫ్ అధికారులు, రాష్ట్ర మంత్రులు ఘనంగా నివాళులర్పించారు. తమిళనాడు హెలిక్యాప్టర్ ప్రమాదంలో ప్రాణాలతో బయట పడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ బుధవారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.

డిసెంబర్ 8న తమిళనాడులోని కూనుర్‌లో ఎంఐ 17వీ5 హెలిక్యాప్టర్ కూలిపోవడంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) చీఫ్ బిపిన్ రావత్, ఆయన భార్యతో సహా 13 మంది ప్రాణాలను కోల్పోగా గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.

అతడిని చికిత్స కోసం వెల్గింటన్‌లోని సైనిక హాస్పిటల్‌కు తరలించారు. ఆ తర్వాత బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ కమాండ్ హాస్పిటల్‌కు తరలించగా బుధవారం మృతిచెందాడు. ఆయన భౌతికకాయాన్ని విమానంలో భోపాల్‌కు తరలించారు.

గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కుటుంబానికి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.1కోట్ల పరిహారం ప్రకటించింది.