ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ కల్లోలం కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాలో నవంబర్ లో బయటపడిన ఓమిక్రాన్ కరోనా వేరియంట్ అతి తక్కువ కాలంలోనే ప్రపంచ దేశాలకు విస్తరింస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం అధికారికంగా ఇప్పటి వరకు 63 దేశాలకు విస్తరించింది. డెల్టా వేరియంట్ కన్నా ప్రమాదకరంగా ఓమిక్రాన్ విస్తరింస్తోంది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తుండటంతో… పలు దేశాల్లో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటి వరకు ఓమిక్రాన్ వేరియంట్ వల్ల ఒక్క మరణం కూడా సంభవించకపోవడం కాస్త ఊరట కలిగించే అంశం.
ఇప్పటి వరకు ప్రపంచంలో 7816 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అనుమానితుల సంఖ్య 78,398 గా ఉంది. మరోవైపు యూకేలో ఓమిక్రాన్ విధ్వంసం కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అక్కడే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. యూకేలో 3137 ఓమిక్రాన్ కేసులు నమోదు కాగా… డెన్మార్క్ 2471, దక్షిణాఫ్రికాలో 779 కేసులు నమోదయ్యాయి. ఇండియాలో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు ఇండియాలో 42 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.