గుడ్ న్యూస్ : హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా… 75వేల మందికి ఉద్యోగాలు

హైదరాబాద్ నగర నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త అందింది. 75 వేల ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ జేఎన్టీయూ వేదిక కానుంది. భారత దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో… ఆజాదీకా అమృతోత్సవ్ లో భాగంగా హైదరాబాద్ జెఎన్టియు యూనివర్సిటీ లో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు నిర్వాహకులు.

ఈ మెగా జాబ్ ఫెయిర్ లో ఏకంగా 75 వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నట్లు.. నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ నెలలో రెండు రోజుల పాటు అంటే. 18వ తేదీ, 19వ తేదీల్లో…. జై మెగా జాబ్ ఫెయిర్ ఏకంగా 150 కి పైగా కంపెనీలు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, బీ ఈ, బీటెక్, డిగ్రీ లేదా పీజీ, బి ఫార్మసీ మరియు ఎంఫార్మసీ చేసిన నిరుద్యోగులు ఈ జాబ్ మేళా లో పాల్గొనవచ్చని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఇక ఈ జాబ్ మేళా నేపథ్యంలో హైదరాబాద్ నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.