ఇండియాలో కొత్తగా 7,350 కరోనా కేసులు.. 561 రోజుల తర్వాత ఇదే మొదటిసారి

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు ఓ రోజు పెరుగుతూ … ఓరోజు తగ్గుతూ వస్తున్నాయి. అయితే తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఇండియా వ్యాప్తంగా కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో… ఇండియా వ్యాప్తంగా 7350 కరోనా మహమ్మారి కేసులు నమోదు అయ్యాయి. అలాగే గడిచిన 24 గంటల్లో 202 మంది కరోనా తో మృతి చెందారు.

ఇంకా నిన్న ఒక్కరోజే కరోనా నుంచి కోలుకొని 797 3 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా యాక్టు కేసుల సంఖ్య 91 456 కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య ఎంత తక్కువగా నమోదు కావడం 561 రోజుల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇండియా వ్యాప్తంగా ఇప్పటి వరకు… 475636 మంది మరణించారు. అలాగే ఇప్పటి వరకు కరణం నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య… 34130768 కు చేరుకుంది. అలాగే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ సంఖ్య 133 కోట్లకుపైగా చేరింది.