BREAKING : యూకేలో తొలి ఓమిక్రాన్ మరణం నమోదు…

-

ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా యూకేలో తొలి కరోనా మరణం నమోదైంది. ఇప్పటికే ఈ దేశంలో ఓమిక్రాన్ కేసులు తీవ్రంగా వస్తున్నాయి. తాజాగా ప్రపంచంలోనే తొలి ఓమిక్రాన్ మరణం యూకేలో సంభవించింది. దీనిని ఆదేశ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ధ్రువీకరించారు. పరిస్థతి ఇలాగే సాగితే.. మరికొన్ని నెలల్లో 75 వేలకు పైగా మరణాలు సంభవించే అవకాశం ఉందని అక్కడి పరిశోధన సంస్థలు హెచ్చిరిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పోలీస్తే యూకేలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే ఇప్పటి వరకు  7816 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 63 దేశాలుకు కరోనా ఓమిక్రాన్ వేరియంట్ విస్తరించింది. యూకేలో 3137 ఓమిక్రాన్ కేసులు నమోదు కాగా… డెన్మార్క్ 2471, దక్షిణాఫ్రికాలో 779 కేసులు నమోదయ్యాయి. అయితే ఇన్నాళ్లు ఓమిక్రాన్ కేసుల్లో స్వల్ప లక్షణాలే ఉన్నాయని చెప్పుకుంటూ వస్తున్న తరుణంలో తొలి మరణం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కువ వేగంగా వ్యాపించే గుణం ఉండటంతో డెల్టా వేరియంట్ కంటే ఎక్కువగా ఓమిక్రాన్ వ్యాపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news