యూరప్ నుంచే ఓమిక్రాన్.. నిజం చెప్పినందుకే ఈ శిక్ష

-

ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న ఓమిక్రాన్ ముందుగా యూరప్ నుంచే వచ్చిందంటూ ఆఫ్రికా దేశాధ్యక్షులు చెబుతున్నారు. నిజం చెప్పినందుకు మేం శిక్ష అనుభవిస్తున్నాం అని చెబుతున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికా ఇదే తరహా వ్యాఖ్యలు చేయగా… తాజాగా బోట్స్ వానా అధ్యక్షుడు కూడా ఈ రకంగానే వ్యాఖ్యానించారు.

ఓమిక్రాన్ వేరియంట్ ను ముందుగా దక్షిణాఫ్రికాలో బయటపడిన తర్వాత.. దక్షిణాఫ్రికా, బోట్స్ వానా, నమీబియా, లెసాతో వంటి ఆఫ్రికా దేశాలపై ప్రపంచ దేశాలు బ్యాన్ విధించాయి. ఈ  నేపథ్యంలో ముందుగా ప్రపంచాన్ని అలెర్ట్ చేసినందుకు మా దేశాలకు శాపంగా మారిందని.. శిక్షలు అనుభవిస్తున్నాయంటూ ఆంక్షలపై ఆయా దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా బోట్స్ వానా అధ్యక్షుడు మోగ్వీటీ మాసిసి ఆంక్షలను తీవ్రంగా తప్పుపట్టారు. ఈ వేరియంట్‌ తమ దేశంలో వెలుగు చూసినప్పటికీ.. యూరప్‌ నుంచి వచ్చిన రాయబారుల్లోనే నలుగురిని మొదట పాజిటివ్‌గా గుర్తించామని వెల్లడించామని తెలిపారు. వివిధ దేశాల నుంచి తమ దేశానికి వచ్చిన రాయబారుల్లో 4గురిలో మొదట ఈ వేరియంట్ ను గుర్తించామని ఓ ఇంటర్య్వూలో అధ్యక్షుడు మోగ్వీటీ మాసిసి వెల్లడించారు. వారు యూరప్ నుంచి వచ్చిన వారేనాా.. అని అడిగి ప్రశ్నకు ఔననే సమాధానం ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news