ఒమిక్రాన్ : కొత్త వేరియంట్ పై జోకులే జోకులు !

-

కొత్త వేరియంట్ ఒక‌టి మ‌న‌పై దాడి చేయ‌నుంద‌ని చైనా కు చెందిన శాస్త్ర‌వేత్త‌లు త‌మదైన ప్ర‌క‌ట‌న‌ల‌తో ఊద‌ర‌గొడుతున్నారు. ఇప్ప‌టికే డెల్టా,ఒమిక్రాన్ వంటి వేరియంట్లు వెలుగు చూశాక మ‌రో కొత్త వేరియంట్ ఒక‌టి వ‌స్తుంద‌ని భ‌య‌పెట్టి చంపుతున్నారు. నియోకొవ్ పేరిట వ‌చ్చే ఈ వేరియంట్ ప్ర‌భావంపై కానీ వ్యాప్తి పై కానీ ఇంకా నిర్థార‌ణ కాలేదు. వీటి రాక ఎలా ఉన్నా వీటి ప్ర‌భావం ఎలా ఉన్నానెట్టింట్లో కొత్త వేరియంట్ పై జోకులు విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి.

ట్రోల్ బేబీ ట్రోల్ అన్న విధంగా అవి తెగ న‌వ్విస్తున్నాయి.వైర‌స్ ఉద్ధృతి కానీ దాని ప్ర‌భావం కానీ ఎలా ఉన్నా కూడా ముందుగా కాస్త ఉప‌శ‌మ‌నం ఇచ్చేలా ఈ జోకులు మాత్రం ఉంటున్నాయి.ఈ క్ర‌మంలోకొత్త వేరియంట్ పై ప్ర‌భాస్ ఫొటోతో ఒక జోక్ వ‌చ్చింది.. నువ్వేమ‌యినా వెబ్ సిరీస్ అనుకుంటున్నావా రోజుకో పేరుతో రావ‌డానికి అంటూ కొత్త వేరియంట్ ను ఉద్దేశించి ఒక ఫొటో కామెంట్ ను memeyer ఉంచారు.

ఈ ఫొటో కామెంట్ ప్ర‌భాస్ అభిమానుల‌నే కాదు అంద‌రినీ ఉర్రూతలూగిస్తుంది. మ‌రో జోక్ ను బ్ర‌హ్మానందం ఫొటోతో ఆర్జే శివ్ రూపొందించారు.ఈ meme కూడా బాగా ఆక‌ట్టుకుంటుంది. చైనా వాళ్ల‌ను ఉద్దేశించి ఒరేయ్ చుంచు మొహాల్లారా ఎన్ని వేరియంట్ల‌ను ప్ర‌పంచం మీద‌కు వ‌దులుతార్రా అంటూ బ్ర‌హ్మానందం ఫ్ర‌స్టేష‌న్ ను అంతా వెళ్ల‌గ‌క్కుతున్న విధంగా ఈ meme ఉంది.

ఇది కాకుండా మ‌రో meme కూడా నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. అది కూడా బ్ర‌హ్మానందం ఫొటోతోనే! జాత‌క శాస్త్రం ప్ర‌కారం ఈ వారం మీకు పాజిటివ్ థింగ్స్ జ‌రుగుతాయి అని చెబుతున్న‌ద‌ని పైన ఓ వాక్యం ఇంగ్లీషులో రాసి,దానికి కౌంట‌ర్ గా కొంప‌దీసి క‌రోనా పాజిటివ్ గానీ రాదు క‌దా! అని రాసి న‌వ్వులు పూయించారు.

ఇది కాకుండా మ‌రో జోక్ కూడా ఓ హోట‌ల్ ముందు ఓ బ్యాన‌ర్ రూపంలోఉంది. దీని ఫొటో కూడా నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. అలిగిన ఆలుమ‌గ‌ల్లా దూరంగా ఉందాం.. అంద‌రినీ సుర‌క్షితంగా ఉంచుదాం అని రాసి ఓ పార్శిల్ కౌంట‌ర్ ద‌గ్గ‌ర ఉంచిన వైనం పై కూడా జోకులు బాగానే పేలుతున్నాయి. అదీ, ఇదీ అని కాదు,ఆడా,ఈడా అని కాదు అన్నింటా క‌రోనా విష‌య‌మై చిన్న, చిన్న డైలాగ్ స్కిట్లు, ఫొటో కామెంట్లు,వీడియో ఎడిట్లు బాగానే వైర‌ల్ అవుతున్నాయి. మాయ‌దారి మ‌హ‌మ్మారి క‌రోనా విష‌య‌మై ఇంకెన్ని వ‌స్తాయో ఇంకెంత న‌వ్వుకోవాలో! ప్ర‌స్తుతానికి మనంద‌రి ప‌రిస్థితీ ఏడ్వ‌లేక న‌వ్వ‌డ‌మే ! కానీ ఇంత‌టి సందిగ్ధ‌త‌లోనూ హాయిగా న‌వ్వుకుంటే ఏం పోయింది.. అందులో న‌వ్విస్తున్న‌వాడు బ్ర‌హ్మీ కావ‌డంతో ఇంకాస్త ఫ‌న్ జ‌న‌రేట్ అవుతుంది..meme రూపంలో!

– చిత్ర క‌థంబం – మ‌న లోకం ప్ర‌త్యేకం

Read more RELATED
Recommended to you

Latest news