ఆంధ్ర ప్రదేశ్ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. కట్టప్ప , నమ్మకద్రోహి అంటూ చురకలు అంటించారు ఎంపీ విజయసాయి రెడ్డి. ” ఏపీ చరిత్రలో అతి చెత్త ఆర్థిక మంత్రి ఎవరంటే టీడీపీలో కట్టప్పగా చెప్పుకునే యనమల పేరు వినిపిస్తుంది. ఏడాదిలో 300 రోజులకు పైగా ఓవర్ డ్రాఫ్ట్, వేస్ అండ్ మీన్స్‌కు వెళ్లిన చరిత్ర ఆయనిది. పైగా తానో పేద్ద మేధావినంటూ నీతి వచనాలు. ప్రజలు ఏనాడో మర్చిపోయారు ఈ నమ్మకద్రోహిని.” అంటూ ఫిర్ అయ్యారు ఎంపీ విజయసాయి రెడ్డి.
2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడుగానీ,1998–2004 మధ్య వాజపేయి గారు ప్రధానిగా ఎన్డీయేలో ఉన్నప్పుడుగానీ, 2014 నుంచి ఇప్పటి వరకుగానీ గుర్తుకు రాని గుంటూరు జిన్నా సెంటర్ ఇప్పుడు జీవీఎల్, వీర్రాజు, దేవ్‌ధర్ వంటి వారికి ఎందుకు గుర్తుకు వస్తోంది? అంటూ బిజేపి నేతలపై సెటైర్లు పేల్చారు. జాతీయ పతాకంలోని మూడు రంగులకూ అర్థం తెలుసా వీరికి? దేశ సార్వభౌమత్వానికి, మత సామరస్యానికి ప్రతీక అయిన జాతీయ జెండాను…ప్రజల మధ్య అగ్గి రాజేయటానికి, సమైక్యతకు విఘాతం కలిగించి మతాల మధ్య చిచ్చు పెట్టడానికి రాజకీయంగా వాడుకుంటారా? అని ప్రశ్నించారు.