కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం… షెడ్యూల్ ప్రకారమే 5 రాష్ట్రాల ఎన్నికలు.

-

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా యూపీ ఎన్నికలు షెడ్యూల్ లోపే జరుపుతామన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర. రాజకీయ పార్టీలన్నీ సమయానికే ఎన్నికలు నిర్వహించాలని కోరాయని.. కోవిడ్ -19 నిబంధనలను అనుగుణంగా ఎన్నికలు నిర్వహించాలని సూచించారని ఆయన వెల్లడించారు. కోవిడ్ పరిస్థితులుతో ఓటర్లు భౌతిక దూరం పాటించేలా పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచుతామని సుశీల్ చంద్ర వెల్లడించారు. ఉత్తర్ ప్రదేశ్ లో అన్ని ఓటింగ్ బూత్‌ల వద్ద వీవీ పాట్ లను ఏర్పాటు చేస్తామని… ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడానికి దాదాపు 1 లక్ష ఓటింగ్ బూత్‌లలో ప్రత్యక్ష వెబ్‌కాస్టింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉంచుతామని ఆయన వెల్లడించారు.

వచ్చే ఏడాది గోవా, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి- మార్చి నెలల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు కోవిడ్ పరిస్థితులను తెలుసుకునేందుకు కేంద్ర వైద్యారోగ్య శాఖతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల టీమ్ పర్యటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news