శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ పాడె మోసిన ఓంకార్..!

-

ప్ర‌మ‌ఖ కొరియోగ్రాఫ‌ర్ శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ క‌రోనాతో బాధ‌ప‌డూతూ ఆస్ప‌త్రిలో క‌న్న‌మూసిన సంగ‌తి తెలిసిందే. అయితే న‌వంబ‌ర్ 29న హైద‌రాబాద్ లోని మ‌హాప్ర‌స్థానం లో ఆయ‌న అంత్య‌క్రియ‌లు జ‌రిపించారు. ఆయ‌న చిన్న కుమారుడు అజయ్ అంత్యక్రియ‌లు నిర్వ‌హించారు. ఈ సంధ‌ర్బంగా ప‌లువురు సీనీప్ర‌ముఖులు శివశంక‌ర్ మాస్ట‌ర్ భౌతిక కాయాన్ని సంధ‌ర్శించి నివాళులు అర్పించారు. అయితే అంత్యక్రియ‌ల‌కు యాంక‌ర్ మ‌రియు ద‌ర్శ‌క నిర్మాత ఓంకార్ మాస్ట‌ర్ కూడా హాజ‌ర‌య్యారు.

omkar at shivshankar master last rites
omkar at shivshankar master last rites

ఈ సంధ‌ర్బంగా శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ పాడెను ఓంకార్ మాస్ట‌ర్ మోశారు. ఓంకార్ తో పాటూ ఓంకార్ త‌మ్ముడు హీరో అశ్విన్ క‌లిసి పాడెను మోశారు. ఓంకార్ ఆట డ్యాన్స్ షోకు ద‌ర్శ‌క‌నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య ఎంతో అనుబంధం ఏర్ప‌డింది. ఆ త‌ర‌వాత ఓంకార్ చేసిన అనేక షోల‌కు శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ అతిధిగా హాజ‌రై అల‌రించారు. ఇక ఆయ‌న దూర‌మ‌వ‌డం ఇండ‌స్ట్రీకి తీర‌ని లోట‌ని సీనీలోకం అభిప్రాయ‌ప‌డుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news