తిరుపతి పట్టణంలోని స్విమ్స్ హాస్పిటల్ లో అత్యంత క్లిష్టమైన సర్జరీ విజయవంతం అయింది. శరీరంలో దిగిన మూడు అడుగుల ఇనుప కడ్డీ దిగింది. ఆ ఇనుప కడ్డీ ని… స్విమ్స్ హాస్పిటల్ వైద్యులు చాలా విజయ వంతంగా బయటకు తీశారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే…. క్రిష్ణాజిల్లా, కైకలూరుకు చెందిన లక్ష్మయ్య.. తాపీ పని చేస్తూ పై భవనం నుంచి కింద పడ్డాడు. దీంతో…. తొడ భాగంగా నుంచి భుజం వరకు చొచ్చుకుపోయింది 3 అడుగుల ఇనుప కడ్డీ. మొదట కైకలూరు, విజయవాడ, గుంటూరు హాస్పిటల్ లో ఆ వ్యక్తికి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి లోని… స్విమ్స్ కు తరలించారు.
ఈ నేపథ్యంలోనే… ఆ వ్యక్తికి ఆపరేషన్ చేసి… 10 ఎం. ఎం సైజు గల 3 అడుగుల ఇనుపకడ్డీని తొలగించారు తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి వైద్యులు. దీంతో ప్రాణా పాయం నుండి భయటపడి క్రమంగా కోలుకుంటున్నాడు తాపీ మేస్త్రీ లక్ష్మయ్య. ఇక స్విమ్స్ ఆస్పత్రి వైద్యులు… చేసిన సేవలపై పలుగురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.